TELANGANA GOVERNMENT JOBS RENGAREDDY DMHO RELEASED NOTIFICATION FOR VARIOUS JOB VACANCIES TODAY LAST DATE FOR APPLICATIONS NS
TS Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు అంటే మే 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
తెలంగాణలో వైద్య విభాగంలో ఖాళీల భర్తీకి ఇటీవల అధికారులు వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ (DMHO)లో ఖాళీల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Jobs) విడుదల చేశారు. మొత్తం 13 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోండానికి మే 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
మెడికల్ ఆఫీసర్లు
06
సైకాలజిస్ట్
01
డీఈఐసీ మేనేజర్
01
స్టాఫ్ నర్స్
01
ల్యాబ్ టెక్నీషియన్
01
ఫార్మసిస్టులు
02
సోషల్ వర్కర్
01
మొత్తం:
13
విద్యార్హతల వివరాలు:వేర్వేరు ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, జీఎన్ఎం, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి. ఇంకా వేతనాల విషయానికి వస్తే ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.21 వేల నుంచి రూ.40వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.21 వేల వేతనం చెల్లించనున్నారు. మెడికల్ ఆఫీసర్ ఖాళీలకు ఎంపికైన వారికి అత్యధికంగా రూ.40 వేల వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. TSPSC Job Notification: నిరుద్యోగులకు అలర్ట్.. TSPSC నుంచి త్వరలో మరో జాబ్ నోటిఫికేషన్.. ఖాళీలు, విద్యార్హతలివే
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
- అభ్యర్థులు https://rangareddy.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేసి ఫామ్ ను నింపాలి.
- పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫామ్ ను డిఎంహెచ్ఓ ఆఫీస్, రంగారెడ్డి జిల్లా చిరునామాలో ఈ రోజు అంటే మే 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.