హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Jobs Free Coaching: నిరుద్యోగుల కోసం కార్పొరేట్‌ స్థాయి ఇనిస్టిట్యూట్.. పైసా ఖర్చు లేకుండా శిక్షణ.. ఎక్కడంటే?

TS Jobs Free Coaching: నిరుద్యోగుల కోసం కార్పొరేట్‌ స్థాయి ఇనిస్టిట్యూట్.. పైసా ఖర్చు లేకుండా శిక్షణ.. ఎక్కడంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ లోని ఎంతో పేరు ప్రఖ్యాతులున్న శిక్షణా సంస్థల్లో భోధించే ఫ్యాకల్టీతో స్థానిక నిరుద్యోగులకు శిక్షణ ఇప్పిస్తున్నారు ఓ ఎమ్మెల్యే. దీంతో నిరుద్యోగుల్లో ఆనంద వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యే అందించిన సహకారంతో ఎలాగైనా జాబ్ కొట్టాలన్న లక్ష్యంతో ప్రిపరేషన్ సాగిస్తున్నారు అభ్యర్థులు.

ఇంకా చదవండి ...

(G. Srinivasareddy, News18, Khammam)

గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల్లో నాణ్యమైన శిక్షణ ఇప్పించి వారికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి (Palair MLA Upender Reddy ) కూసుమంచి మండలం గోపాలరావు పేట లోని జిన్నింగ్ మిల్లు లో ఉచిత శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఇప్పటికే గ్రూప్ 1, పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే మరో 50వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీస్, గ్రూప్ 1,విద్యుత్ శాఖల్లో ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా యువతను ఆయా ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు ఎమ్మెల్యే ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన డిగ్రీ, పీజీ తదితర విద్యార్హత ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించడమే ఈ శిబిరం లక్ష్యం. ఇందులో భాగంగానే గత కొన్ని రోజులుగా నిరాటంకంగా శిక్షణ శిబిరం కొనసాగుతోంది. హైదరాబాద్ లోని ఎంతో పేరు ప్రఖ్యాతులున్న షైన్ ఇండియా వంటి శిక్షణా సంస్థల్లో భోధించే అధ్యాపకులతో పాటు పేరున్న మరికొన్ని శిక్షణా సంస్థల నుంచి అధ్యాపకులను ఇక్కడికి తీచుకొచ్చారు. నాణ్యమైన బోధనతో శిక్షణా శిబిరం నడుస్తున్నందున తరగతులకు హాజరవుతున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అనుభవం కలిగిన ఫ్యాకల్టీలతో అన్ని అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సెంటర్లో పాలేరు నియోజకవర్గం లోని సుమారు 800 మంది అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. వీరికి పోటీ పరీక్షలకు అవసరమయ్యే సిలబస్ ను వంద శాతం బోదించడం ద్వారా రాబోయే ఉద్యోగ పరిక్షల్లో ప్రతిభను చాటి ఎక్కువ మంది ఉద్యోగాలు సాదించేలా సిద్ధం చేస్తున్నారు. ఏప్రిల్ 15 న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈ ఉచిత శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు.

TS Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీ నిలిపివేత.. మంత్రి షాకింగ్ ప్రకటన.. అక్రమాలపై విచారణకు ఆదేశం

నగరాలు, పట్టణాల్లోని కోచింగ్ సెంటర్లకు వెళ్లి వేలాది రూపాయల ఫీజులు చెల్లించి చదువుకునే స్థోమత లేని గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ ఇస్తున్నారు. కార్పొరేట్ కోచింగ్ సెంటర్ లో ఇచ్చే శిక్షణను ఇక్కడ ఇస్తుండడం విశేషం. గ్రూప్ 2,4 లతో పాటు ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్, తదితర పోటీ పరీక్షలకు అభ్యర్థులను సర్వత్రా సిద్ధం చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తరగతుల నిర్వహణ, అనంతరం టెస్టులు వారానికి ఒక సారి గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే జియాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం, భారతరాజ్యాంగం, అర్ధమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు గ్రామర్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర సబ్జెక్టులు బోధిస్తున్నారు.

Telangana Govt Jobs: తెలంగాణలో డిగ్రీ అర్హతతో మరో జాబ్ నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. మెరిట్ ఉంటే ఉద్యోగమే..

ఉచిత కోచింగ్ సెంటర్ కు రోజుకు రూ 20 వేల వరకు ఖర్చు అవుతుంది. శిక్షణ కేంద్రానికి వచ్చే అభ్యర్థులకు తాగునీటి సౌకర్యం తో పాటు మద్యాహ్నం భోజనం పెడుతున్నారు. ప్రతి రోజూ టీ ఇస్తున్నారు. ఈ ఉచిత శిక్షణ కేంద్రంలో ఒక్కో అద్యాపకునికి రోజుకు రూ 20 వేలు చెల్లిస్తున్నారు. 20 మంది ఫ్యాకల్టీలు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఈ ఖర్చులన్నీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమకూరుతున్నాయి. ప్రస్తుతానికి 80 రోజుల పాటు శిబిరాన్ని నడుపనున్నారు. ఇందుకు మొత్తం ఖర్చు కోటి పైనే ఉంటుందని సమాచారం. అవసరం మేరకు గడువును పెంచే అవకాశం ఉంది.


గ్రామీణ యువత స్థిరపడాలనే శిక్షణ

గ్రామీణ ప్రాంత పేద, మధ్య తరగతి యువతీ యువకులు పట్టణ ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీచుకునే పరిస్థితిలో లేరు. పట్టణాల్లో అందించే శిక్షణను ఇక్కడే అందించి ఎక్కువ మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనే లక్ష్యంతోనే ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. స్థానిక అధికారుల సహకారంతో ఖర్చుకు వెనుకాడకుండా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.

First published:

Tags: Job notification, JOBS, Telangana government jobs

ఉత్తమ కథలు