Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS NOTIFICATION RELEASED FOR VARIOUS JOB VACANCIES AT BIBINAGAR AIIMS HERE APPLICATION PROCESS NS

Jobs in Telangana: నిరుద్యోగులకు అలర్ట్.. బీబీనగర్ ఎయిమ్స్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్

బీబీనగర్ ఎయిమ్స్ లోగో

బీబీనగర్ ఎయిమ్స్ లోగో

తెలంగాణలోని బీబీ నగర్ లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ (Bibinar AIIMS) లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలోని బీబీ నగర్ లో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను (AIIMS, BIBINAGAR) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీబీనగర్ ఎయిమ్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 94 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు సంబంధించి ఈ ఖాళీలు ఉన్నాయి. ఫిజియాలజీ, బయో కెమెస్ట్రీ, అనాటమీ, పాథాలజీ, మైక్రోబయోలజీ, ఫార్మకాలజీ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

    ఖాళీల వివరాలు:

































    S.Noపోస్టుఖాళీలు
    1.ప్రొఫెసర్లు29
    2.అడిషనల్ ప్రొఫెసర్లు11
    3.అసోసియేట్ ప్రొఫెసర్లు18
    4.అసిస్టెంట్ ప్రొఫెసర్లు36
    మొత్తం:94

    విద్యార్హతల వివరాలు:
    పైన పేర్కొన్న స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు టీచింగ్ లేదా రీసెర్చ్ అనుభవం ఉండాలని వెల్లడించారు. అభ్యర్థులు నాన్ మెడికల్ అయితే ఆయా సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ చేసిన వారై ఉండాలి.
    Agnipath Scheme Facts: అగ్నిపథ్ పథకంపై అపోహలు.. అన్నింటికీ క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. వివరాలివే..

    ఇతర వివరాలు:
    -దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
    -అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://aiimsbibinagar.edu.in/ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    -దరఖాస్తు చేసుకున్న అనంతరం అప్లికేషన్ ఫామ్ ను బీబీనగర్ ఎయిమ్స్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.


    -ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ ఉద్యోగ ప్రకటన వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తుకు గడువు ఉంటుంది. అభ్యర్థులు ఆ తేదీలోపు తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
    -అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు