Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS NOTIFICATION RELEASED FOR JOBS VACANCIES AT TSNPDCL NS

Telangana Jobs: తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల.. కొనసాగుతున్న కొలువులు జాతర.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్ (Telangana Job Notification) విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. తాజాగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ (TSNPDCL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టీఎస్ఎన్పీడీసీఎల్ ప‌రిధిలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Job Notification) విడుదల చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 82 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లలో వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. www.tsnpdcl.cgg.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు జూలై 11 వరకు అవకాశం కల్పించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 14న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాత పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

    విద్యార్హతల వివరాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో బ్చాలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఈ డిగ్రీ పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18-44 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజుగా రూ.120 చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, PH, EWS అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షా కేంద్రాలను కేటాయిస్తారు.
    Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కార్ అనుమతులు.. ఏ శాఖలో అంటే?



    TSNPDCL పరిధిలోకి వరంగల్, హన్మకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు వస్తాయి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు