హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Group-4 Notification: నిరుద్యోగులకు మంత్రి హరీష్ రావు శుభవార్త.. గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలపై కీలక ప్రకటన

TS Group-4 Notification: నిరుద్యోగులకు మంత్రి హరీష్ రావు శుభవార్త.. గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలపై కీలక ప్రకటన

మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు మరో శుభవార్త చెప్పారు. గ్రూప్-4 నోటిఫికేషన్లపై కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet | Hyderabad

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు (Group-4 Jobs) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేయనున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మల్టీ పర్పస్ హైస్కూలులో పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న దాదాపు 300 మంది అభ్యర్థులకు ఆదివారం ఉదయం మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. మంత్రి చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ శిబిర తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 70 రోజుల పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు సిద్ధిపేట, గజ్వేల్ లో ప్రిలిమినరీ-రాత పరీక్షకు 1030 మందికి శిక్షణ అందించారు. ఈ శిబిరంలో శిక్షణ పొంది 580 మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఆసక్తి ఉన్న వారికి రెండవ దశలో తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.

జిల్లాలోని సిద్దిపేట , దుబ్బాక, గజ్వేల్, చేర్యాల పట్టణాల్లో దేహ దారుఢ్య శిక్షణ కార్యక్రమం మొదలు పెట్టినట్లు వెల్లడించారు. ప్రిలిమినరీ పరీక్ష పూర్తయ్యిందనీ, ఇక ఫిజికల్ దేహ దారుఢ్య పరీక్ష మిగిలిందనీ, మీరంతా పట్టుదలతో ఉద్యోగం కోసం సాధన చేయాలన్నారు. అప్పుడే ప్రజాప్రతినిధులుగా మాకు నిజమైన ఆనందాన్ని ఇచ్చిన వారవుతారనీ మంత్రి అభ్యర్థులకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుందన్నారు. త్వరలోనే గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చెప్పారు.

వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేయనున్నామని మంత్రి వివరించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తూ.. అగ్నిపథ్ పేరిట కాంట్రాక్టు విధానం తేవడం హేయమైన చర్య అని హరీష్ రావు మండిపడ్డారు. మంత్రి వెంట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీపీ మహేందర్, ఏసీపీ దేవారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Group 4, Harish Rao, JOBS, Telangana government jobs, TSPSC

ఉత్తమ కథలు