రచయిత: బింధు, టెట్ ఫ్యాకల్టీ
(G. Srinivas Reddy, News18, Khammam)
కాంపిటేటివ్ ఎగ్జాంలో సిలబస్‌ను, టైంటేబుల్‌ను ఫాలో కావడం చాలా ముఖ్యమని టెట్ ఫ్యాకల్టీ బింధు అభ్యర్థులకు సూచించారు. డీఎస్సీకి సంబంధించిన ఎలిజిబులిటీ టెస్ట్ అయిన టెట్‌లోనూ, ఎస్జీటీలోనూ ప్రిపేర్ అయ్యేవాళ్లు ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలన్నారు. ఎగ్జామ్ స్టాండర్డ్‌ను తెలుసుకోవాలంటే వీలైనన్ని ఎక్కువ మోడల్ టెస్ట్‌లను రాయాలని వివరించారు. పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను అసాంతం అర్థం చేసుకోవాలని, ఒకసారి నిర్ణయించుకున్న టైంటేబుల్‌ను ఖచ్చితంగా ఫాలో అయితేనే ఫలితం ఉంటుందన్నారు. అలాగే విసుగు విరామం తెలీకుండా రోజులో కన్వీనియెంట్గా ఉన్న సమయంలో కాసేపు ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఉంటుందని వివరించారు.
నిత్యం ఒకే సమయంలో నిద్ర పోవడం, నిద్ర లేవడం వల్ల కన్సిస్టెన్సీ పెరిగుతుంది. అలాగే ఎక్కువ పుస్తకాలను చదవాలన్న అపోహ కూడా ఉంది. ఇది సరికాదు. సిలబస్ కవర్ చేస్తున్న పుస్తకాలను ఎంపిక చేసుకుని, వాటినే ఎక్కువ సార్లు కవర్ చేయడం వల్ల ఉ పయోగం ఉంటుంది. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల ఎగ్జాం ప్యాట్రన్ అర్థం అవుతుంది. స్టాండర్డ్ కూడా అర్థం అవుతుంది.
TS Teacher Jobs: ఇంగ్లిష్ టీచర్ అవుదామనుకుంటున్నారా? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..
మంచి ఆహారం తీసుకుంటూ, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు రాయడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించవచ్చు. అలాగే వీలైనంత తక్కువ మందితో గ్రూప్ స్టడీ కూడా మంచిదే. ఇది ఇతరేతర డిస్ట్రబెన్స్‌కు కారణం కారాదు. ఎప్పటికప్పుడు మనం ఎక్కడ ఉన్నాం.. ఇంకా సిలబస్ ఎంత ఉందన్న దాన్ని అంచనా వేసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉందని బిందు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, JOBS, Telangana government jobs