హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. సిలబస్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి

Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. సిలబస్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరుగుతున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొ.హరగోపాల్ సిలబస్ గురించి చెప్పిన వివరాలు అభ్యర్థుల కోసం..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

    తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification) విడుదలైన విషయం తెలిసిందే. తమ కలల గ్రూప్ 1 కొలువు సాధించడమే లక్ష్యంగా లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపరేషన్ ను పరుగులు పెట్టిస్తున్నారు. మొత్తం 503 ఖాళీలకు గాను 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ కు సంబంధించి ఒక్కో పోస్టుకు 756 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. త్వరలోనే గ్రూప్-2 తదితర నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ సిలబస్ (TSPSC Syllabus) కమిటీ చైర్మన్ అయిన ప్రొఫెసర్ హరగోపాల్ (Prof Haragopal) ఓ టీవీ చానల్ కు కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చారు. సిలబస్ పై పలు అంశాలను వివరించారు. అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఆయన చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాష్ట్ర భౌగోళిక స్వరూపం, రాజకీయం, ఆర్థిక వ్యవస్థ మారుతుందన్నారు. తెలంగాణలో పని చేసే అధికారికి తెలంగాణ జనాభా, ఏ వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు తదితర అంశాలపై పట్టు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణ చరిత్ర ఏంటి? ఇక్కడ ఇన్ని ఉద్యమాలు ఎందుకు జరగాల్సి వచ్చిందో తెలుసుకోవాలని వివరించారు.

    తెలంగాణ భాష గురించి, తెలంగాణ సంస్కృతి, పండుగల గురించి తప్పక తెలుసుకోవాలన్నారు. ఉద్యోగం సాధించిన తర్వాత కూడా ఈ అంశాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉంటుందన్నారు. తెలంగాణ సంస్కృతిలోని విశిష్టతను తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇంకా ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఆర్టికల్ కు సంబంధించిన చరిత్ర, ప్రత్యేకతను అర్థం చేసుకోవాలన్నారు. రాజ్యంగంపై పట్టు ఉండాలన్నారు. షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 కు సంబంధించిన చారిత్రక నేపథ్యాలను తెలుసుకోవాలన్నారు.

    Telangana History Book: ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త.. తెలంగాణ చరిత్ర, ఉద్యమంపై మరో పుస్తకం.. ఆవిష్కరించిన సీఎస్ సోమేశ్ కుమార్

    తెలంగాణ ఆర్థిక, రాజకీయ చరిత్రపైనా అవగాహన ఉండాలన్నారు. ఈ అవగాహన ఉంటే అభ్యర్థులు ఉద్యోగం సాధించిన తర్వాత విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, భాష, పండుగలకు ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే సిలబస్ లో మార్పులు చేసినట్లు చెప్పారు హరగోపాల్. మాథ్స్ విషయానికి వస్తే హైస్కూల్ స్టాండర్డ్ కు అనుగుణంగా సిలబస్ ను రూపొందించినట్లు వివరించారు.

    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, State Government Jobs, Telangana government jobs, TSPSC

    ఉత్తమ కథలు