TELANGANA GOVERNMENT JOBS HERE IS IMPORTANT SUGGESTIONS AND TIPS FROM IAS OFFICER BURRA VENKATESHAM TO ASPIRANTS NS
TS Govt Jobs: ఇలా ప్రిపేర్ అయితే ఉద్యోగం పక్కా.. అభ్యర్థులకు ప్రముఖ ఐఏఎస్ అధికారి చేసిన సూచనలివే
మాట్లాడుతున్న బుర్రా వెంకటేశం (ఫొటో: ఫేస్ బుక్)
ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అభ్యర్థులకు సలహాలు-సూచనలు అందించేందుకు టి-సాట్ నెట్వర్క్ ((T-SAT Network) ) ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం హాజరయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగాల (Telangana Government Jobs) సాధన కోసం ఏకాగ్రతతో చదివితే సక్సెస్ అవుతరారని ఐఏఎస్ అధికారి, తెలంగాణ బీసీ వెల్ఫేర్ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సూచించారు. లక్ష్యాన్ని ఎంచుకుని సరైన పద్దతిలో సబ్జెక్ట్ పై పట్టు సాధిస్తే విజయాలు వాటంతటవే వస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అభ్యర్థులకు సలహాలు-సూచనలు అందించేందుకు టి-సాట్ నెట్వర్క్ (T-SAT Network) ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి బుర్రా వెంకటేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోన్ల విభజన వలన స్థానిక కోటా పెరిగిందన్నారు. సివిల్స్ ఉద్యోగాల్లో ఒక ఉద్యోగానికి లక్ష మంది పోటీ పడుతున్నారు. అయితే.. తెలంగాణలో విడుదల చేసిన భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ల (Job Notifications) కారణంగా 95 శాతం స్థానికులకే అనే నిబంధనతో ఒక పోస్టుకు 10 మంది మాత్రమే పోటీ పడే అవకాశం ఉందన్నారు. నియామకాలలో ఇంటర్వూలను తొలగించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక నిర్ణయమన్నారు. ఫలితంగా అభ్యర్థులు తమ నైపుణ్యంపైనే భరోసా వేసుకోవాల్సి ఉంటుందని బుర్రా స్పష్టం చేశారు.
భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ, స్థానికులకే 95 శాతం అవకాశాలు, నిరుద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం సరైన సమయం, అవకాశం ఇచ్చినందున నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశం సూచించారు. 503 గ్రూప్-1 ఉద్యోగాలతో పాటు సుమారు 80 వేల ఉద్యోగాలను భర్తీకి నిర్ణయం భవిషత్య్ లో కష్ట సాధ్యమని అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. TSPSC Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. అతి త్వరలోనే 9,168 పోస్టులతో గ్రూప్-4 నోటిఫికేషన్.. ఎప్పుడంటే?
#పత్రికప్రకటన 19.05.2022
ప్రిపరేషన్ పై సరిగా దృష్టి పెట్టండి...సక్సెస్ సాధిస్తారు
-బి.సి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం
(టి-సాట్, సాఫ్ట్ నెట్) pic.twitter.com/oP8CzwFO3d
11 కేంద్రాల్లో ప్రత్యక్ష్య తరగతులు:
బీ.సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని ఆయా జిల్లాల్లో 11 బి.సి స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే సుమారు 6,500 మందికి ప్రత్యక్ష్య బోధన చేస్తున్నామని ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. వీరందరికీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందిస్తున్నామన్నారు. గ్రూప్-1, ఎస్.ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రస్తుతం కోచింగ్ అందిస్తున్నామని, భవిష్యత్ లో మరికొంత మందికి మరి కొన్ని ఉద్యోగాలపై కోచింగ్ అందించనున్నామని తెలిపారు. టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లతో అనుసంధానమై సేవలు మరింత విస్తృత పరుస్తున్నామన్నామని వివరించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.