Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS FOLLOW THIS IMPORTANT TIPS FOR TO GET GOOD SCORE IN ARITHMETIC NS

TS Jobs Preparation Tips: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, అర్థమెటిక్ లో పట్టు పెంచుకోండిలా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అర్థమెటిక్ లో మంచి మార్కులు సాధిస్తేనే ఉద్యోగ సాధన సులువు అవుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఫ్యాకల్టీ, త్రిశూల్ డిఫెన్సీ అకాడమీ డైరెక్టర్ అశోక్ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో భారీగా ఉద్యోగాల (Telangana Government Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు కలల కొలువు సాధించాలన్న లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్నారు. ఏ ఉద్యోగ నియామక పరీక్ష అయినా.. అర్థమెటిక్ (Arithmetic) లో మంచి మార్కులు సాధిస్తేనే ఉద్యోగ సాధన సులువు అవుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఫ్యాకల్టీ, త్రిశూల్ డిఫెన్సీ అకాడమీ డైరెక్టర్ అశోక్ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. టైం ఎండ్ వర్క్, టైం ఎండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్టీమ్స్, ప్రాఫిట్స్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజస్ టాపిక్స్ ను అభ్యర్థులు బాగా చదువుకోవాలన్నారు. ఈ టాపిక్స్ ను కవర్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించి 80 శాతం సిలబస్ ను కవర్ చేసినట్లేనన్నారు. మిగతా 20 శాతం సిలబస్ ను కూడా చాలా సింపుల్ మెథడ్స్ లో ఆన్సర్ చేసుకోవచ్చన్నారు. మొదట ప్రశ్నలను అర్థం చేసుకోవడం అలవర్చుకోవాలని అభ్యర్థులకు సూచించారు.

    ప్రతీ ప్రశ్నకు యావరేజ్ గా 40 సెకండ్ల సమయం ఉంటుందన్నారు. ఈ సమయంలోనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుని ఆన్సర్ కనుగొనడంతో పాటు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇంత తక్కువ సమయంలో ఆన్సర్ చేయాలంటే సాధన ఎక్కువ చేయాలన్నారు. నియామక పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు స్టాండర్డ్ పుస్తకాలు చదవాలన్నారు. ఎక్కువ పుస్తకాలు చదవడం కన్నా.. ఎంపిక చేసిన పుస్తకాలనే చదువుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
    TS Jobs Alerts: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ కావాలా?.. అయితే.. ఇలా చేయండి



    అభ్యర్థులు ముందుగా సిలబస్ ఏంటనే అంశాన్ని ఫోకస్ చేయాలని సూచించారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ను సేకరించి వాటిలోని ప్రశ్నలను సాధన చేయాలన్నారు. ఆ పేపర్లలో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారనే అంశంపై పట్టు సాధించాలన్నారు. ప్రిపరేషన్ ప్రారంభించిన నాటి నుంచి ఎగ్జామ్ ముందు రోజు వరకూ ప్రిపరేషన్లో ఆసక్తి తగ్గకుండా ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Govt Jobs 2022, JOBS, Preparation, Telangana government jobs

    తదుపరి వార్తలు