Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS FINANCE DEPARTMENT GIVES CLEARANCE TO FILL ANOTHER 1663 JOB VACANCIES NS

TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. మరో 1663 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు.. ఏ శాఖల్లో అంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఆర్థిక శాఖ (Telangana Finance Department) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో 1663 ఖాళీల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో 80 వేలకు పైగా ఖాళీలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటన మేరకు.. ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా మరో 1663 ఖాళీల (Jobs) భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఇరిగేషన్, R&B శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియెరెన్స్ ఇచ్చింది. ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ( అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్) లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ( ఆర్ అండ్ బి, ఎన్. హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ ఆర్ యూబీ ఎస్, హెచ్ వోడీ) లో284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ HODలో 53, డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ (HOD)లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది.

    ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం అనుమతులు ఇచ్చిన 1663 ఖాళీలతో కలిపి ఇప్పటి వరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను సైతం ఆయా నియామక సంస్థలు విడుదల చేశాయి. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
    HPCL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ -1 పోటీ (TSPSC Group 1) పరీక్షలకు టీ-సాట్ నెట్వర్క్ శుభవార్త చెప్పింది. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన పాఠ్యాంశాలనూ సిద్ధం చేసింది. జూలై ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గంట పాటు ప్రత్యేక ప్రసారాలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీ-సాట్ (T-SAT) సీఈవో రాంపురం శైలేష్ రెడ్డి తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఆంగ్ల మాధ్యమ ప్రసారాలకు సంబంధించిన వివరాలు వెళ్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా భర్తీ చేస్తున్న గ్రూప్-1 ఉద్యోగాలకు (Group1 Jobs) ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్ భాషలో సుమారు 60 గంటల పాఠ్యాంశ భాగాలను ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై రెండవ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి 10 గంటల వరకు టీ-సాట్ విద్య ఛానల్ లో అరగంట నిడివిగల రెండు పాఠ్యాంశాలు ప్రసారమవుతాయన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు