Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS DHARMAPURI E CLASSROOM APP DESIGNED FOR CANDIDATES NS KNR

TS Govt Jobs APP: తెలంగాణ ఉద్యోగార్థుల కోసం ప్రత్యేక యాప్.. మొత్తం 57 జాబ్స్ కు మెటీరియల్.. మంత్రి కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు (Telangana Government Jobs) ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ధర్మపురి ఈ-యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) కోరారు. సోమవారం ధర్మపురి లో షాది ఖానా మరియు టీ.టీ.డీ లో గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలకు (Telangana Government Jobs) సిద్ధమవుతున్న విద్యార్థులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ శాఖ మరియు ఎల్.ఎం.కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో 850 రైటింగ్ ప్యాడ్స్ అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ (CM KCR) 1.31 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో భర్తీ చేశారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 90 వేల ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని, స్థానికులకు 95% ఉద్యోగ అవకాశాలు దక్కేలా నూతన జీవన విధానం ఆమోదింపజేసుకున్నామని మంత్రి తెలిపారు.

    ధర్మపురి నియోజకవర్గ పరిధిలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దక్కెందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమ శాఖ ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. పోలీసు ఉద్యోగాలు, గ్రూప్స్ కొరకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామని, విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నూతన యాప్ సైతం రుపోందించామని మంత్రి అన్నారు.
    Group Exams: గ్రూప్-1 ఉద్యోగాలకు తీవ్ర పోటీ, అభ్యర్థులు ఎలా సిద్దం కావాలి: రిటైర్డ్ అధికారి సూచనలు

    ధర్మపురి ఈ క్లాస్ రూమ్ యాప్ ను విద్యార్థులు ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. విద్యార్థుల కోసం యాప్ లో ఆంగ్ల మాధ్యమం, తెలుగు మాధ్యమ కోర్సులు ప్రవేశ పెట్టామని మంత్రి అన్నారు. ఆంగ్ల మాధ్యమం కోర్సులో 4 సబ్జెక్ట్ లు ఉంటాయని, రాష్ట్రస్థాయి పోటీలతో పాటు 57 రకాల కేంద్ర పరీక్షలు రాయడానికి సైతం ఉపయోగ పడతాయని మంత్రి తెలిపారు. తెలుగు మాధ్యమ కోర్సులో రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షల సిలబస్ సంబంధించిన సబ్జెక్టు ఉంటాయని అన్నారు.
    Army Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో ఆర్మీ జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    రేపు మధ్యాహ్నం వరకు యాప్ లో విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని, వారు పరీక్ష లకు సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని, మనకు ఉద్యోగం లభిస్తుంది అనే నమ్మకంతో విద్యార్థులు కృషి చేసి పూర్తి ఏకాగ్రతతో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.

    విద్యార్థులు శిక్షణ సమయంలో సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, పూర్తి ఏకాగ్రత ప్రిపరేషన్ పై కేటాయించాలని కలెక్టర్ సూచించారు. సాధారణ పరీక్షలకు పోటీ పరీక్షలకు చాలా తేడా ఉంటుందని, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే అందరి కంటే మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ ఉందని , పేద విద్యార్థులు వెనకబడ్డ కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.

    మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్


    పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎందుకు విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్స్, రైటింగ్ ప్యాడ్ పంపిణీ చేశామని, యాప్ సైతం రుపోందించామని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ విజయం సాధించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ , ఎస్.సత్తెమ్మ, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాధవి, ఎస్సి వెల్ఫేర్ అధికారి రాజ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు