TELANGANA GOVERNMENT JOBS ASPIRANTS CAN GET IMPORTANT UPDATES BY REGISTER WITH THIS T SAT NETWORK NS
TS Jobs Alerts: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ కావాలా?.. అయితే.. ఇలా చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణ పోలీస్, గ్రూప్స్ తో పాటు టెట్, యూపీఎస్సీ, SSC ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే.. ఈ జాబ్స్ కు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇలా చేయండి.
తెలంగాణలో కొలువుల జాతర (Telangana Government Jobs) మొదలైన విషయం తెలిసిందే. భారీగా ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లను (Job Notifications) విడుదల చేస్తున్నాయి ఆయా నియామక బోర్డులు. ఇప్పటికే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) పోలీస్ శాఖలోని 17 వేలకు పైగా ఖాళీల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది. ఇంకా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సైతం 503 గ్రూప్ 1 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే.. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20న ముగియనుండగా.. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 31న ముగియనుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి తేదీలు, ఇతర అప్ డేట్లకు సంబంధించిన విషయంలో పలు ప్రచారాలు నిత్యం వస్తున్నాయి. దీంతో అభ్యర్థులు ఏది నిజమో, ఏది కాదో అని తెలియక ఆందోళన చెందుతున్నారు. ఇంకా ప్రిపరేషన్ లో మునిగిపోయిన లక్షలాది మంది అభ్యర్థులు సైతం అప్ డేట్ల కోసం అధికారిక వెబ్ సైట్లలో చెక్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
ఇలాంటి అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న T-SAT Network శుభవార్త చెప్పింది. ఏ ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారైనా.. అత్యాధునిక సమాచారం కోసం టి-సాట్ గూగుల్ ఫామ్స్ లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ ఫామ్ లో వివరాలను నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఫోన్ నంబర్ లేదా మెయిల్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ను T-SAT Network అందించనుంది. TET, SI/Constable, TSPSC Groups, SSC, UPSCతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు సంబంధించిన అత్యాధినిక సమచారాన్ని పొందడానికి గూగుల్ ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. TSPSC Group 1 | T-SAT: గ్రూప్ 1 అభ్యర్థులకు టీ-సాట్ శుభవార్త.. బెస్ట్ ఫ్యాకల్టీతో 1000 ఎపిసోడ్ల ఉచిత శిక్షణ.. వివరాలివే
నమోదు చేసుకోవడానికి అభ్యర్థులు ఇలా చేయాల్సి ఉంటుంది. Step1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ (https://t.co/t4EyrknJ0P)పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. Step 2: అనంతరం గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, మీరు ప్రిపేఱ్ అవుతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ పేరు నమోదు చేసుకోవాలి. Step 3: చివరికి సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.