హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణలో మరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

Telangana Jobs: తెలంగాణలో మరో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పలు ఖాళీల భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ (Telangana Jobs) నిరుద్యోగులకు మరో శుభవార్త. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో పలు ఖాళీల భర్తీకి అధికారులు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్రంలోని వివిధ ఏఆర్టీ సెంటర్లలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై (Telangana Job Application) చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న విద్యార్థులకు రాత పరీక్ష అనంతరం ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

  విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  పోస్టుఖాళీలు
  మెడికల్ ఆఫీసర్4
  స్టాఫ్ నర్స్2
  ఫార్మసిస్ట్ లు1
  ల్యాబ్ టెక్నీషియన్9
  క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్5
  క్లినికల్ సర్వీసెస్ ఆఫీసర్5
  డేటా మానిటరింగ్, డాక్యుమెంటేషన్ ఆఫీసర్5
  జాయింట్ డైరెక్టర్1
  డిప్యూటీ డైరెక్టర్1
  మొత్తం:33

  విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు అధికారులు. పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, డీఫార్మసీ, బీఎస్సీ ఎంఎల్టీ, ఎండీ, డీఎన్బీ, ఎంబీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

  DRDO Recruitment 2022: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. డీఆర్డీఓలో 1901 ఉద్యోగాలు .. పూర్తి వివరాలివే

  ఇదిలా ఉంటే.. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TS BC Study Circle) నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పింది. సివిల్ సర్వీసెస్ కు (Civil Service) ప్రిపేర్ అయ్యే వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కోచింగ్ ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది బీసీ స్టడీ సర్కిల్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ (Application Process) ఈ నెల 8వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.

  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఫలితాలను 27వ తేదీన విడుదల చేస్తారు. మెరిట్ సాధించిన విద్యార్థులకు ఈ నెల 28 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 200 మంది అభ్యర్థులకు ఓయూ సెంటర్, హైదరాబాద్ , మరో 100 మంది విద్యార్థులకు హన్మకొండలో శిక్షణ ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job notification, JOBS, Telangana government jobs

  ఉత్తమ కథలు