Home /News /jobs /

TELANGANA GOVERNMENT JOBS APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES AT RANGAREDDY DISTRICT HERE DETAILS NS

Telangana Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు ఇటీవల నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Telangana Jobs) దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజే లాస్ట్ డేట్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Rangareddy | Hyderabad
    కరోనా ప్రారంభం నాటి నుంచి కేంద్రంతో పాటు రాష్ట్రాల ప్రభుత్వాలు వైద్య విభాగం బలోపేతంపై శ్రద్ధ చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఖాళీలను (Job Vacancies) భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సైతం వైద్య రంగంలో ఖాళీలను ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO-Rangareddy) పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజును అంటే ఆగస్టు 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వరంలోని కమిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

    విభాగాల వారీగా ఖాళీలు..
























    క్రమ సంఖ్యపోస్టు ఖాళీలు
    1.మెడికల్ ఆఫీసర్35
    2.స్టాఫ్ నర్స్35
    మొత్తం:70

    NIA Recruitment 2022: అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తు విధానం ఇలా..
    విద్యార్హతల వివరాలు:

    మెడికల్ ఆఫీసర్: ఎంబీబీఎస్ విద్యార్హతతో పాటు తెలంగాణ లేదా ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ విభాగంలోని ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 ఏళ్ల నుంచి 39 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్-సర్వీస్ మెన్ కు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
    స్టాఫ్ నర్స్: GNM/BSc నర్సింగ్ విద్యార్హతతో పాటు నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.


    దరఖాస్తు చేయడం ఎలా:
    Step 1: అభ్యర్థులు మొదట అధికారిక వెబ్ సైట్ https://rangareddy.telangana.gov.in/ ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం హోం పేజీలో నోటిఫికేషన్స్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం మీకు నోటిఫికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ను కిందకు స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.
    Step 4: అప్లికేషన్ ఫామ్ లో పేర్కొన్న వివరాలను పూర్తిగా నింపాలి.
    Step 5: అప్లికేషన్ ఫామ్ ను డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 294 దగ్గర, మణికంఠ కాలనీ, శివరాంపల్లి, రాజేంద్రనగర్, రంగారెడ్డి జిల్లా చిరునామాలో ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు