TELANGANA GOVERNMENT JOBS APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES AT AYUSH DEPARTMENT HERE DETAILS NS
Telangana Govt Jobs: తెలంగాణలో డిగ్రీ అర్హతతో మరో జాబ్ నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. మెరిట్ ఉంటే ఉద్యోగమే..
(ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో మరో విభాగంలో ఉద్యోగాల భర్తీకి (Telangana Government Jobs) అధికారులు మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం కొలువుల జాతర (Telangana Government Jobs) సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, పోలీస్, ఎలక్ట్రిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను (TS Jobs Notification) విడుదల చేశారు అధికారులు. అయితే.. వీటితో పాటు పలు కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సైతం అధికారులు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) చెందిన సికింద్రాబాద్ లోని ఆయుష్ విభాగం (Department of AYUSH) కమిషనర్ కార్యాలయం నుంచి పలు ఖాళీల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 159 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో ఆయుర్వేద విభాగంలో 93, యూనాని విభాగంలో 17, హోమియోపతి విభాగంలో 42, నేచురోపతి విభాగంలో 7 ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు అధికారులు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు
విభాగం
ఖాళీలు
ఆయుర్వేద
93
యునాని
17
హోమియోపతి
42
నేచురోపతి
07
మొత్తం:
159
విద్యార్హతల వివరాలు:
ఆయుర్వేద, హోమియో, యునాని విభాగాల్లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్థులు తెలంగాణలో పర్మినెంట్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అయి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు. నేచురోపతి విభాగంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. వయస్సు జులై 1 నాటికి 44 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులను సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. TS Jobs GS Preparation Tips: తెలంగాణజాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారా? ఫిజిక్స్ వెయిటేజీ, టిప్స్, చదవాల్సిన బుక్స్ వివరాలివే
ఎలా అప్లై చేయాలంటే...
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు దరఖాస్తులను https://ayush.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
- డౌన్ లోడ్ చేసుకున్న దరఖాస్తుల్లో సూచించిన వివరాలను నింపి ఈ నెల 31వ తేదీలోగా కమిషనర్, ఆయుష్ విభాగం, సికింద్రాబాద్, తెలంగాణ చిరునామాకు చేరేలా పంపించాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.