హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Jobs: స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.. 200కు పైగా ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

TS Jobs: స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.. 200కు పైగా ఖాళీలు.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉమ్మడి వరంగల్ గిరిజన నిరుద్యోగుల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల (Nurse Jobs) భర్తీకి ప్రకటన వెలువడింది. ఈసందర్భంగా నిర్వహించే పరీక్షలో మెరిట్ సాధిస్తే చాలు...ఐదంకెల జీతంతో కాంట్రాక్టు ఉద్యోగం పొందవచ్చు

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal | Hyderabad

  (Venu Medipelly, News18, mulugu)

  ఉద్యోగ నోటిఫికేషన్స్ (Job Notification)  కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగార్థులు. సరైన ఉద్యోగాలు (Jobs) రాక పదవ తరగతి అర్హత గల ఉద్యోగానికి కూడా ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు. ఏ పనైనా ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగులు. అనేక మంది గిరిజన యువత వైద్యరంగంలో స్థిరపడాలని స్టాఫ్ నర్స్ కోర్సులు (Course) చేస్తుంటారు. ఈ కోర్సు ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగంలో ఉపాధి దొరకడం చాలా సులభంగా ఉంటుంది. దీని కోసమే గిరిజన యువతులు పోటీపడి మరీ బీఎస్సీ నర్సింగ్ లేదా సమానమైన కోర్సులు పూర్తి చేస్తుంటారు. ఇలాంటి అభ్యర్థుల కోసమే 200పైగా ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ వెలువడింది. ఉమ్మడి వరంగల్ గిరిజన నిరుద్యోగుల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈసందర్భంగా నిర్వహించే పరీక్షలో మెరిట్ సాధిస్తే చాలు...ఐదంకెల జీతంతో కాంట్రాక్టు ఉద్యోగం పొందవచ్చు.

  200 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ: స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

  హైదరాబాద్ నిజాం ఇనిస్ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో ఒప్పంద ప్రాతిపాదికన 200 మంది స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.

  అర్హత: బీఎస్సీ (నర్సింగ్) / తత్సమానా ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.

  వయస్సు: 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల వయసు కలిగి ఉండవలెను.

  ఎంపిక: వచ్చిన దరఖాస్తుదారులకు పోటీ పరీక్ష నిర్వహించి పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగానికి గిరిజనులు 500 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

  Telangana Job Notifications: రెండు రోజుల్లో గ్రూప్-4 నోటిఫికేషన్.. వారంలో మరో 28 వేల ఉద్యోగాలకు.. నిరుద్యోగులకు మంత్రి హరీశ్ అదిరిపోయే శుభవార్త


  చివరి తేదీ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించేవారికి చివరి తేదీ: 06.09.2022.

  ఆఫ్‌లైన్/నేరుగా దరఖాస్తులు సమర్పించే వారికి చివరి తేదీ: 10.09.2022.

  పోస్ట్ ద్వారా దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఎగ్జిక్యూటివ్ రిజిస్టార్, 2వ ఫ్లోర్, ఓల్డ్ ఓపిడి బ్లాక్, నిమ్స్, హైదరాబాద్ 500082.


  పరీక్ష తేదీ: స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సెప్టెంబర్ 18.09.2022న పరీక్ష నిర్వహించి వచ్చిన మెరిట్ మార్కుల ద్వారా తుది జాబితా రూపొందించడం జరుగుతుంది.

  పూర్తి వివరాలకు సంప్రదించవలసిన వెబ్‌సైట్: https://nims.edu.in

  ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా గాని ఆఫ్‌లైన్ ద్వారా గాని తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job notification, JOBS, Telangana government jobs

  ఉత్తమ కథలు