హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Govt Jobs: నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. వయో పరిమితి పెంపుపై కీలక ఉత్తర్వులు.. వివరాలివే

Telangana Govt Jobs: నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. వయో పరిమితి పెంపుపై కీలక ఉత్తర్వులు.. వివరాలివే

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

  తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ (TRS Government) మరో శుభవార్త చెప్పింది. నియామకాలకు (Jobs) సంబంధించి గరిష్ఠ వయో పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గరిష్ఠ వయో పరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం. ఇప్పటి వరకు గరిష్ట వయో పరిమితి 34 ఏళ్లు ఉండగా... తాజా ఉత్తర్వులతో అది 44 ఏళ్లకు పెరిగింది. ఈ వయోపరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తించనుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. అయితే.. అగ్నిమాపక శాఖ, అటవీశాఖ ఉద్యోగాలకు ఈ వయోపరిమితి వర్తించదు. ఇదిలా ఉంటే.. తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ (CM KCR) ఈ నెల 9న శుభవార్త చెప్పారు.  ఉద్యోగాలపై అసెంబ్లీలో కీలక ప్రకటన చేస్తానని అంతకు ముందు రోజు వనపర్తి సభలో చెప్పిన సీఎం ఆ మేరకు అసెంబ్లీలో ప్రకటించారు.

  తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. అందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. మిగిలిన 80,039 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సంచలన ప్రకటన చేశారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. పోలీస్ శాఖ మినహా ఉద్యోగార్థుల వయోపరిమితిని మరో 10 పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు తాజాగా వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఉద్యోగాల భర్తీపై వరుస ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

  TSPSC Group-III: తెలంగాణలో 1,373 గ్రూప్-III ఖాళీలు.. త్వరలోనే నోటిఫికేషన్.. సిలబస్, పరీక్షా విధానం ఇదే

  ముందుగా పోలీస్ జాబ్స్ కు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉగాది రోజున జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబ్ నోటిఫికేషన్లపై సీఎస్ సోమేశ్ కుమార్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధంగా ఉండాలని వారిని ఆదేశించారు. సీఎం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని సూచించారు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CM KCR, Job notification, JOBS, Telangana government jobs

  ఉత్తమ కథలు