TELANGANA GOVERNMENT INVITING APPLICATIONS FROM THE STUDENTS FOR SCHOLARSHIPS HERE DETAILS NS
Telangana Scholarships: తెలంగాణలో విద్యార్థులకు గమనిక.. స్కాలర్ షిప్స్ కోసం దరఖాస్తులు.. మరో 5 రోజులే ఛాన్స్
ప్రతీకాత్మక చిత్రం
అర్హత కలిగిన విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లను (PMS) మంజూరు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అర్హత కలిగిన విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లను (PMS) అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను ప్రారంభించింది. ఇందుకు సంబంధించి విద్యార్థులు ప్రభుత్వ వెబ్ సైట్ ఈ- పాస్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే11 నుంచి ప్రారంభమైంది. నమోదు చేసుకోవడానికి చివరి తేదీని మే 21గా నిర్ణయించారు.రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వెనుకబడిన తరగతి (BC), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC), మైనారిటీలు, శారీరక వికలాంగ విద్యార్థుల ప్రయోజనం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ స్కాలర్షిప్లను ప్రవేశపెట్టింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెన్యూవల్‌తో పాటు తాజా స్కాలర్‌షిప్‌ల మంజూరు కోసం ఇ-పాస్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలనుకునే విద్యార్థులు తమ డేటాను అక్టోబర్ 24లోపు అప్లోడ్ చేయాలి.
అర్హత ప్రమాణాలు
స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల అర్హత ప్రమాణాలు ఇలా ఉన్నాయి. SC లేదా ST వర్గానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. BC, EBC, లేదా వికలాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటే వారి తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే విద్యార్థి హాజరు శాతం ప్రతి త్రైమాసికం చివరిలో 75%గా ఉండాలి. UGC Shodh Chakra: వారి కోసం కొత్త ప్రోగ్రామ్.. శోధ్ చక్ర పేరుతో ప్రారంభించిన యూజీసీ..
అవసరమైన డాక్యుమెంట్లు
పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (PMS) కోసం దరఖాస్తుదారులు క్వాలిఫైయింగ్ పరీక్ష మార్క్ షీట్‌తో పాటు ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలకు సంబంధించి పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు సమర్పించాల్సి ఉంటుంది.
టీఎస్- ఈ పాస్ స్కాలర్షిప్ దరఖాస్తు విధానం
అర్హత ఉన్న విద్యార్థులు టీఎస్ ఈ పాస్ అధికారిక వెబ్ పోర్టల్‌లో ఆన్లైన్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ల వారీగా వివరాలు ఇలా..
స్టెప్-3: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సేవలను ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-4: సంబంధిత కాలమ్స్‌లో వ్యక్తిగత వివరాలు, అర్హత వివరాలు, బ్యాంకు వివరాలు నమోదు చేయాలి.
స్టెప్-5: అన్ని వివరాలను నమోదు చేసిన తరువాత అభ్యర్థులు తప్పనిసరిగా అప్లికేషన్ క్షుణంగా సమీక్షించాలి. చివరగా కోడ్‌ను నమోదు చేసి ‘‘అప్లికేషన్‌ను సమర్పించు” అనే బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్-6: చివరగా దరఖాస్తు ఫారమ్ ప్రింటౌట్ తీసుకోవాలి. హార్డ్ కాపీని సంబంధిత పాఠశాల లేదా కళాశాలకు సమర్పించాలి.
తప్పుడు సమాచారం నమోదు చేస్తే దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎంతో జాగ్రత్తగా వివరాలను నమోదు చేయాలి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.