హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Jobs: తెలంగాణలో మరో 3,897 ఉద్యోగాల భర్తీకి అనుమతులు.. ఏ శాఖలో అంటే?

Telangana Jobs: తెలంగాణలో మరో 3,897 ఉద్యోగాల భర్తీకి అనుమతులు.. ఏ శాఖలో అంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో కొలువుల జాతర (Telangana Government Jobs) కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 80 వేల ఉద్యోగాల భర్తీని చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా కసరత్తును అధికార యంత్రంగం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఈ ఖాళీలను (Jobs) భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు వైద్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Minister Harish Rao) తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరాలను వెల్లడించారు.రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, జనగాం, నిర్మల్ జిల్లాలోని మెడికల్ కాలేజీల్లో నియామకాలకు సంబంధించి ఈ అనుమతులు మంజూరు చేసినట్లు చెప్పారు. తద్వారా ఒక్కో మెడికల్ కాలేజీలో 433 చొప్పున నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (CM KCR) ఆదేశాల మేరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి (Telangana Government Jobs) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఇటీవల బీఆర్‌కేఆర్ భవన్‌లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పై టీఎస్పీఎస్సీ చైర్మన్ డా.బి.జనార్ధన్ రెడ్డి తో కలసి వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు.

పలు శాఖల్లో నియామక ప్రక్రియను ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్ బోర్డు, తదితర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా భర్తీ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

First published:

Tags: Health jobs, JOBS, State Government Jobs, Telangana government jobs

ఉత్తమ కథలు