తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు (TS Job Notification) విడుదలవుతున్న విషయం తెలసింది. దీంతో రాష్ట్రంలో కొలువు జాతర కొనసాగుతోంది. తాజాగా వైద్య విద్య పూర్తి చేసిన వారికి తెలంగాణ సర్కార్ (Telangana Government) శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్‌మెంట్ కింద ఈ పోస్టులను (Jobs) మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులో వెల్లడించింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ డిపార్ట్‌మెంట్ సెలక్షన్ కమిటీ విడుదల చేయనుంది. ఈ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, ఎంపిక విధానం, అప్లికేషన్ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవాలని జీవోలో పేర్కొంది ప్రభుత్వం. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నారు అధికారులు. క్యాడర్ వైస్ వెకేన్సీ పొజిషన్, రోస్టర్ పాయింట్లు, అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లు(Notifications) విడుదల అవుతున్నాయి. గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు పలు రకాల ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీటిలో గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేశారు. ఈ వారంలో రోజుల్లో ఈ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక టీఎస్పీఎస్సీ తో పాటు.. ఇతర నియామక సంస్థల నుంచి కూడా తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిపికేషన్లు వచ్చాయి.
వీటితో పాటు.. తెలంగాణలోని పలు జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా 6 నోటిఫికేషన్లకు సంబంధించి హైకోర్టు ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. అంతే కాకుండా.. మార్చి తర్వాత విడుదల కాబోయే మిగిలిన నోటిఫికేషన్ల వివరాలను కు సంబంధించి నియామకాల క్యాలెండర్ విడుదల చేసింది హైకోర్టు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Nims, State Government Jobs, Telangana government jobs