హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

EAMCET, NEET, JEEకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. వివరాలివే

EAMCET, NEET, JEEకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. వివరాలివే

సబితారెడ్డి(ఫైల్ ఫొటో)

సబితారెడ్డి(ఫైల్ ఫొటో)

ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి ఉచితంగా కోచింగ్ అందిచనున్నట్లు ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎంసెట్, నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఉచితంగా షార్ట్ టైమ్ కోచింగ్ ను ఆన్లైన్ ద్వారా అందించనున్నట్లు తెలిపింది. ఈ కోచింగ్ ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వివిధ సబ్జెక్టుల్లో పేరొందిన లెక్చరర్లతో ఈ ఆన్లైన్ శిక్షణను అందిస్తున్నమని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు దీటుగా కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో రాణించాలని మంత్రి సబితా సూచించారు. ఈ కోచింగ్ ను గతేడాది సైతం ప్రభుత్వం నిర్వహించింది. గతేడాది మొత్తం 20 వేల మంది విద్యార్థులు కోచింగ్ కు హాజరయ్యారని మంత్రి వివరించారు. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యార్థులు కోచింగ్ కు హాజరయ్యారని వెల్లడించారు. ఈ 20 వేల మందిలో 2, 685 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించినట్లు మంత్రి తెలిపారు.

  Scholarships: విద్యార్థులకు ఆ బ్యాంక్ స్కాలర్​షిప్ ల ప్రకటన.. దీనికి ఎవరు అర్హులంటే..

  గతేడాది విద్యార్థులకు అందించిన కోచింగ్ మంచి ఫలితాలను అందించడంతో ఈ ఏడాది సైతం కొనసాగించినట్లు మంత్రి వివరించారు. విద్యార్థులు ఉచిత ఆన్లైన్ కోచింగ్ ను http://tscie.rankr.io లింక్ ద్వారా పొందాలని అధికారులు సూచించారు.  వివిధ ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు ఎంసెట్, జేఈఈ, నీట్ తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ కోసం లక్షల రూపాయలను వసూలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం అందించే ఈ ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా విద్యార్థులు ఆ ఖర్చును లేకుండానే ఆయా పరీక్షలకు ప్రిపేర్ కావొచ్చు.  ఈ కరోనా నేపథ్యంలో ఇంటి దగ్గరే ఉంటూ ఉచితంగా కోచింగ్ పొందొచ్చు.

  ఇదిలా ఉంటే.. కరోనా నేపథ్యంలో గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా అధికారులు టెన్త్ ఎగ్జామ్స్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పరీక్షలను రద్దు చేస్తున్న సమయంలో విద్యార్థులకు మార్కులను కేటాయించే విధానం సరిగా ఉండడం లేదన్న విమర్శలు వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ అధికారులు వార్షిక పరీక్షల నిర్వహణలో మార్పులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

  ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT)తో ప్రభుత్వ పరీక్షల విభాగం(SSC Board) అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సీబీఎస్ఈ బోర్డు ప్రకటించినట్లుగా రాష్ట్రంలోనూ ఏడాదికి రెండు సార్లు పరీక్షలు జరిపే అంశంపై అధికారులు చర్చించనున్నారు. ఇంకా ఫార్మెటివ్ అసెస్మెంట్ ప్రశ్నపత్రాలు రాష్ట్రం మొత్తం ఒకేలా ఉంటే బాగుంటుందన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. మరి కొన్ని రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Jee, JEE Main 2021, NEET, NEET 2021, Sabita indra reddy, Telangana, TS EAMCET 2021

  ఉత్తమ కథలు