తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక ప్రకటన చేసింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో (Telangana Inter First Year Results) ఫెయిలయిన విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి (sabita indra reddy) ప్రకటించారు. వారందరికీ కనీస మార్కులను కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కేవలం 49 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైన విషయం తెలిసిందే. దీంతో కొందరు విద్యార్థులు ఫెయిలయ్యామని మనస్థాపం చెంది ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నాయకులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనలు సైతం చేపట్టారు. రోజు రోజుకూ వివాదం పెద్దది అవుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఫెయిలయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ వివరాలను మంత్రి సబితారెడ్డి కొద్ది సేపటి క్రితం ప్రెస్ మీట్ నిర్వహించి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కరోనా కారణంగా టెన్త్ పరీక్షలు కూడా రాయలేదన్నారు. ఈ నేపథ్యంలో వారు సెకండియర్ ఎగ్జామ్స్ రాసే కంటే ముందు ఓ పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందన్న భావనతోనే ఇటీవల ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించామన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా మానసిక నిపుణలతో కౌన్సెలింగ్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు.
TS Inter First Year Results: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి
మరి కొన్ని నెలల్లోనే ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఉండాలన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. అయితే.. విద్యార్థుల పాస్ పర్సంటేజ్ తక్కువగా నమోదు కావడంలో బోర్డు తప్పేమి లేదని మంత్రి స్పష్టం చేశారు.
NEET 2022: నీట్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఈ యాప్‌లో ఉచితంగా మాక్ టెస్టులు
ఆన్లైన్ క్లాసులు సరిగా నిర్వహించలేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎప్పటికప్పుడు లెక్చరర్లు విద్యార్థులతో టచ్ లోనే ఉన్నారన్నారు. విద్యార్థులంతా పరీక్ష ఫెయిల్ కాగానే బోర్డు ముందు ధర్నా చేయకుండా.. తాము ఎందుకు ఫెయిల్ కావాల్సి వచ్చిందో ఆలోచించుకోవాలని సూచించారు. విద్యార్థులంతా కష్టపడి చదివి సెకండియర్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని మంత్రి కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Sabita indra reddy, Telangana inter board, Telangana Inter Results