హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana: తెలంగాణలో టీచర్లు, నిరుద్యోగులకు షాక్.. వివాదాస్పదంగా మారిన ఆ జీవో.. అసలేం జరిగిందంటే?

Telangana: తెలంగాణలో టీచర్లు, నిరుద్యోగులకు షాక్.. వివాదాస్పదంగా మారిన ఆ జీవో.. అసలేం జరిగిందంటే?

తెలంగాణలో టీచర్లు, నిరుద్యోగులకు షాక్.. వివాదాస్పదంగా మారిన ఆ జీవో.. పూర్తి వివరాలివే

తెలంగాణలో టీచర్లు, నిరుద్యోగులకు షాక్.. వివాదాస్పదంగా మారిన ఆ జీవో.. పూర్తి వివరాలివే

Telangana G.O 317: తెలంగాణలో కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన కొత్త జీవో వివాదాస్పదంగా మారింది. ఆ జీవోను తక్షణం రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు (Telangana Employees Union) డిమాండ్ చేస్తున్నాయి. నిరుద్యోగులు సైతం ఆ జీవోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

తెలంగాణలో (Telangana) ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. అయితే.. ఇందుకోసం కేసీఆర్ సర్కార్ (TRS Government) తీసుకువచ్చిన జీవో నంబర్ 317 (G.O No 317) వివాదాస్పదంగా మారింది. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. బీఆర్కే భవన్ ను కూడా ముట్టడించేందుకు ప్రయత్నించాయి. బీసీ సంఘాల నేతలు కూడా నిన్న ఉన్నతాధికారులను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. జీవో నంబర్ 317ను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులు (Telangana Unemployed) సైతం ఈ జీవో నంబర్ 317 ద్వారా తీవ్రంగా నష్టం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జీవో నంబర్ 317 వివాదాస్పదం కావడానికి కారణాలు ఇలా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉద్యోగాలు జిల్లా, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్లుగా విభజింజబడి ఉంటాయి. టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. గతంలో జిల్లాల విభజనకు పూర్వం టీచర్ ఉద్యోగాలను సర్కార్ భర్తీ చేసింది. అయితే.. ఇప్పుడు ఆ ఉద్యోగాలను కొత్త జిల్లాల వారీగా కేటాయిస్తున్నారు.

అయితే.. జిల్లాల ఏర్పాటు సమయంలో ఒకే ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాలు వేరే ఉమ్మడి జిల్లాల్లోకి వెళ్లాయి. ఉదాహరణకు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న మద్దూరు, చేర్యాల, కొమురవెళ్లి తదితర మండలాలు ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోకి చేరాయి. సిద్దిపేట జిల్లా గతంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో భాగంగా ఉండేది. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, కోహెడ, బెజ్జంకి తదితర మండలాలు సైతం సిద్దిపేట జిల్లాలో చేర్చారు. గతంలో షాద్ నగర్, ఆమనగల్లు, మాడ్గుల తదితర మండలాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేవి. ఇప్పుడవి రంగారెడ్డి జిల్లాలో చేర్చింది కేసీఆర్ సర్కార్.

Transfer Guidelines: ఉద్యోగులకు అలర్ట్... బదిలీలు, పోస్టింగ్‌ల మార్గదర్శకాలు విడుదల

కాగా.. ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులను జిల్లాల వారీగా కేటాయిస్తున్న సమయంలో సీనియారిటీని ప్రాతిపదికన తీసుకుంది. దీంతో సీనియర్లు అంతా పట్టణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. దీంతో గత రెండు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించిన జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మారు మూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాను పరిశీలిస్తే.. సీనియర్లు అనేక మంది వరంగల్, హన్మకొండ తదితర పట్టణాలకు సమీపంలోని పాఠశాలలను ఎంచుకున్నారు. దీంతో జూనియర్లు తప్పనిసరి పరిస్థితుల్లో ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో జూనియర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Telangana Govt Jobs: నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. ముహూర్తం ఎప్పుడంటే?

దాదాపు అన్ని జిల్లాల్లో గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన అనేక మంది సీనియర్లు పట్టణాలకు ఆప్షన్లు పెట్టుకోవడంతో సీనియారిటీ ఆధారంగా వారికి అక్కడి ఖాళీలనే కేటాయించారు. దీంతో పట్టణ ప్రాంతాలకు చెందిన జూనియర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ ప్రాంతం కాకపోయినా.. కొత్త జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని జూనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Jobs in Telangana: తెలంగాణ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌!

అయితే.. ఈ విధానంతో నిరుద్యోగులకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఇప్పుడు వరంగల్ లాంటి అర్బన్ ప్రాంతాలకు వెళ్లిన సీనియర్లు జూనియర్లతో పోల్చితే త్వరగా పదవీ విరమణ చేసే అవకాశం ఉంటుంది. అయితే మారుమూల వెనుకబడిన జిల్లాలకు, ఏజెన్సీ ఏరియాలకు వెళ్లిన జూనియర్ల ఉద్యోగ విరమణకు మాత్రం ఇంకా చాలా ఏళ్లు ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఖాళీలు త్వరగా ఏర్పడే అవకాశమే ఉండదు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లోని నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

Singareni Jobs 2022: న్యూ ఇయర్ లో సింగరేణిలో కొలువుల జాతర.. విభాగాల వారీగా ఖాళీల వివరాలివే..

టీచర్ ఉద్యోగాలను జిల్లాల వారీగా ఏర్పడిన ఖాళీల ఆధారంగానే భర్తీ చేస్తూ ఉంటారు. దీంతో ఆ మారుమూల ప్రాంతాల్లో ఇప్పట్లో ఖాళీలు ఏర్పడే అవకాశమే ఉండదని నిరుద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీచర్ల కేటాయింపునకు ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం హేతుబద్ధంగా లేదని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికేనా కేసీఆర్ సర్కార్ స్పందించి అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన కొత్త విధానాన్ని తీసుకురావాలని టీచర్లు, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: CM KCR, State Government Jobs, Telangana employees, Telangana Government, Unemployees

ఉత్తమ కథలు