TELANGANA GOVERNMENT FREE TRAINING CLASSES ALONG WITH SCHOLARSHIPS FOR COMPETITIVE EXAMINATIONS GOVERNMENT ARRANGEMENTS HERE THE DETAILS GH VB
Telangana Government: పోటీ పరీక్షల కోసం స్కాలర్ షిప్‌లతో పాటు ఉచిత శిక్షణ తరగతులు.. ప్రభుత్వం ఏర్పాట్లు..
ప్రతీకాత్మక చిత్రం
పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎడ్ టెక్ పంపెనీ అన్ అకాడమీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం స్కాలర్ షిప్‌లను మంజూరు చేయనుంది. ప్రతిభ ఉండి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికోసం ఈ స్కాలర్ షిప్‌లు మంజూరు చేయనున్నారు.
పోటీ పరీక్షలకు ప్రిపేర్(Competitive Exams) అవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. ఎడ్ టెక్ పంపెనీ(Ed Tech Company) అన్ అకాడమీ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం స్కాలర్ షిప్‌లను మంజూరు చేయనుంది. ప్రతిభ ఉండి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికోసం ఈ స్కాలర్ షిప్‌లు(Scholarships) మంజూరు చేయనున్నారు. దాదాపు 4,500 మంది ఔత్సాహిక విద్యార్థులకు ఈ ప్రయోజనం కలగనుంది. దీంతోపాటు అభ్యర్థులు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో ‘అన్ అకాడమీ ప్లస్(Un Academy Plus)’ సబ్స్క్రిప్షన్(Subscription) సదుపాయం పొందనున్నారు.
స్కాలర్షిప్ అర్హతలు
BCWD ద్వారా గుర్తింపు పొంది.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు, రాష్ట్రంలోని పాఠశాలల్లో 10, 11, 12 తరగతులు చదివి ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్లు పొందడానికి అర్హులు. ఇందు కోసం అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, కళాశాల ప్రవేశ పరీక్షలు నిర్వహించే edtech సంస్థ మూడు దశల్లో ఆప్టిట్యూడ్ పరీక్షల(Aptitude Test) సిరీస్‌ను నిర్వహించనుంది. ఆప్టిట్యూడ్ పరీక్షకు అర్హత సాధించిన తెలంగాణకు చెందిన బాలికలు అన్ అకాడమీ మెగా జాతీయ కార్యక్రమం ‘శిక్షోదయ’ కింద స్కాలర్షిప్లను అందుకోనున్నారు.
ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను మంజూరు చేయనున్నారు. తద్వారా పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి విద్యార్థులను మరింత ప్రోత్సహించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ (బీసీడబ్ల్యూడీ) అన్ అకాడమీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. స్కాలర్‌షిప్‌ల సహాయంతో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న రాష్ట్రానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడం, వారికి ఆర్థిక సాధికారత కల్పించడం తమ లక్ష్యమని అన్ అకాడమీ సంస్థ పేర్కొంది.
ఉద్యోగాల భర్తీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇటీవల కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 91,142 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్... ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న వారికోసం ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించింది.
IITs: జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత లేకుండానే ఐఐటీలలో చదువుకొనే అవకాశం.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..!
50వేల మందికి ఆఫ్‌లైన్‌లో, మరో 50వేల మందికి ఆన్లైన్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రకటించింది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా మరో 50 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇన్‌స్టాగ్రామ్‌లో బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్ పేరుతో సోషల్ మీడియా గ్రూపులను సైతం కమిషన్ ఏర్పాటు చేసింది. గత 15 రోజుల్లో 3,000 మందికి పైగా అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ గ్రూప్ సభ్యత్వం పొందారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షల్లో నాణ్యమైన శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.