హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Group-4 Jobs: తెలంగాణలో కొలువుల పండుగ.. 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

TSPSC Group-4 Jobs: తెలంగాణలో కొలువుల పండుగ.. 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో 9168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ (Telangana Government) భారీ శుభవార్త చెప్పింది. 9,168 గ్రూప్-4 ఖాళీల (TSPSC Group-4) భర్తీకి అనుమతులు మంజూరు చేస్తూ కొద్ది సేపటి క్రితం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్పీఎస్సీ (TSPSC) నుంచి త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల కానుంది.  తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఈ వివరాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇందులో వివిధ డిపార్ట్మెంట్లలో కలిపి పోస్టుల వారీగా ఖాళీలు ఉన్నాయి.

క్ర.సంఖ్యపోస్టుఖాళీలు
1.జూనియర్ అకౌంటెంట్429
2.జూనియర్ అసిస్టెంట్6,859
3.జూనియర్ ఆడిటర్18
4.వార్డ్ ఆఫీసర్1,862
మొత్తం: 9,168

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల తర్వాత అత్యంత ఎక్కువ మంది నిరుద్యోగులు గ్రూప్-4 నోటిఫికేషన్ కోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి ఈ ఉద్యోగాలపై నిరుద్యోగుల ఆసక్తి ఉంది. మంత్రి హరీశ్ రావు సైతం ఇటీవల అనేక సార్లు గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల అవుతుందని ప్రకటనలు చేశారు. అయితే.. ఈ రోజు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడంతో నోటిఫికేషన్ సైతం త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఏర్పాడింది. ఈ వారంలోనే టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఈ నెలాఖరులోగా ఈ నోటిఫికేషన్ వస్తుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. దాదాపు పది లక్షల మంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో అత్యంత పకడ్భందీగా నోటిఫికేషన్ ను రూపొందించే పనిలో టీఎస్పీఎస్సీ నిమగ్నమై ఉంది. ఎలాంటి సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నోటిఫికేషన్ విడుదలలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పది శాతం రిజిర్వేషన్లు కల్పించిన తర్వాత వచ్చిన తొలి నోటిఫికేషన్ సైతం ఇదే కావడం గమనార్హం.

First published:

Tags: Harish Rao, JOBS, TSPSC

ఉత్తమ కథలు