Home /News /jobs /

TELANGANA GOVERNMENT EXTENDED LAST DATE FOR TELANGANA POLICE JOBS APPLICATIONS NS

Telangana Police Jobs Applications: తెలంగాణ పోలీస్ జాబ్స్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తు గడుపు పొడిగింపు.. ఎప్పటివరకంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించి వయో పరిమితిని మరో రెండేళ్ల పాటు పొడిగించిన కేసీఆర్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు గడువును ఈ నెల 26 వరకు పొడిగించింది.

    తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు (Telangana Police Jobs) సంబంధించిన దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. వయోపరిమితిని మరో రెండేళ్ల పాటు సడలింపును ఇవ్వాలని సీఎం కేసీఆర్ (CM KCR) ఈ రోజు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో 6 రోజుల పాటు పొడిగించింది తెలంగాణ సర్కార్ (Telangana Government). నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుకు ఈ రోజు అంటే మే 20ని ఆఖరి తేదీ. దరఖాస్తులకు ఈ రోజు ఆఖరి తేదీ కావడంతో భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో సర్వర్ మొరాయించడంతో కొన్ని చోట్ల అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఇంకా వయో పరిమితిని పొడిగించడంతో తమకు సమయం ఇవ్వాలని అనేక మంది నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి వినతులు వచ్చాయి. దీంతో స్పందించిన కేసీఆర్ సర్కార్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

    ఇదిలా ఉంటే.. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, రవాణా శాఖల్లో మొత్తం 17, 291 ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఖాళీలకు సంబంధించి నిన్నటి వరకు మొత్తం 5.2 లక్షల మంది అభ్యర్థులు 9.33 లక్షల దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ ఫోస్టులకు అప్లై చేసుకోవడంతో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో మహిళా అభ్యర్థుల నుంచి ఇప్పటి వరకు 2.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది.
    TS Police Recruitment: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. వారిని ప‌ట్టిస్తే రూ.లక్ష బహుమతి

    వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరో 4 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ రోజు చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించడంతో సర్వర్ డౌన్ అయ్యి వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఖరి తేదీ అయిన ఈ నెల 26 వరకు ఆగకుండా అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకుంటే బెటర్.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: JOBS, Telangana government jobs, Telangana police jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు