తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను ఇంకా దురదృష్టం వీడడం లేదు. 30 శాతం ఫిట్ మెంట్ అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి నెలలు దాటుతున్నా వారికి ఇంకా కొత్త వేతనాలు అంద లేదు. ఈ నెల కూడా వారు పాత వేతనాలే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో కరోనా విజృంభించడం, సీఎం కేసీఆర్ కే కరోనా సోకడంతో సంబంధిత ఫైల్ పై ఆయన సంతకం చేయలేకపోవడం తదితర కారణాలతో ఇన్నాళ్లు ఉద్యోగులకు పాత వేతనాలే అందాయి. అయితే ఆ తర్వాత జీవో జారీ కావడంతో జులై ఒకటిన తమకు కొత్త వేతనాలు అందుతాయని ఉద్యోగులు ఆశించారు. కానీ సాఫ్ట్ వేర్ కారణంగా ఈ సారి కూడా పాత వేతనాలే అందే పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు వివిధ ప్రభుత్వ శాఖలు పాత పే స్కేల్ ప్రకారమే బిల్లులు రూపొందిస్తున్నాయి. జిల్లాల్లోని సబ్ ట్రెజరీ కార్యాలయాలు, రాజధానిలో పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఈ మేరకే బిల్లలను అధికారులు అందిస్తున్నారు. అయితే.. కొత్త వేతనాల వ్యత్యాస డబ్బులు మాత్రం జూలై 10 లోపు అందుతుందని తెలుస్తోంది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్.. ఆయా శాఖ ల ఉన్నతాధికారులకు అంతర్గతంగా ఆదేశాలను జారీ చేసింది. 7th Pay Commission: డీఏ హైక్ కన్నా ముందే... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శుభవార్తలు
ఆలస్యం ఎందుకంటే..
పెరిగిన వేతనాలను ఎలా నిర్ధారించాలో వివరిస్తూ రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ మార్గదర్శక జీవోలను జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం.. డ్రాయింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అధికారులు(డీడీవో)లు వేతనాలను లెక్కలించాల్సి ఉంటుంది. కానీ.. సచివాలయం కేంద్రంగా ఉండే సెంట్రల్ సర్వర్లో ఆయా శాఖల వారిగా కొత్త వేతనాలను అప్డేట్ చేయలేదు. దీనికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల్లోని డీడీవోలు ప్రతి నెలా 15 నుంచి 25వ తేదీలోపు సబ్ ట్రెజరీ ఆఫీసు(ఎస్టీవో)లకు తమ కింద ఉండే ఉద్యోగులకు వేతన బిల్లులను అందిస్తుంటారు.
అదే జంట నగరాలకు సంబంధించిన వివిధ విభాగాల అధిపతులు ప్రతీ నెల 22 లోపు పే అండ్ అకౌంట్స్ ఆఫీసులకు బిల్లులను సమర్పిస్తారు. ఇదంతా ఆన్లైన్ విధానంలోనే సాగుతుంటుంది. హార్డ్ కాపీలను ఆయా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో అందిస్తారు. ఆ బిల్లులను పరిశీలించి, రిజర్వు బ్యాంకుకు చెందిన ఈ-కుబేర్కు బదిలీ చేస్తారు. ఆ బిల్లుల ఆధారంగా ‘నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(ఎన్ఈఎఫ్టీ)’ పద్ధతిలో ఈ-కుబేర్ నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో వేతనాలను జమ చేస్తారు. అయితే వేతనాల సాఫ్ట్వేర్ అప్ డేట్ కావడంతో ఈ సారి కూడా పాత వేతనాలే అందించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాత వేతనాల ప్రకారమే బిల్లులు తయారు చేసి పంపిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.