హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Holiday: బ్రేకింగ్ న్యూస్.. రేపు తెలంగాణలో సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Telangana Holiday: బ్రేకింగ్ న్యూస్.. రేపు తెలంగాణలో సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రేపు సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రేపు అంటే సెప్టెంబర్ 17, శనివారం నాడు సెలవు (Holiday) ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. జాతీయ సమైక్యతా వేడుకల్లో (Telangana Jateeya Samaikyata Vajrotsavalu) భాగంగా రేపు సెలవు ప్రకటించింది కేసీఆర్ సర్కార్. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ (Telangana CS Somesh Kumar) కుమార్ కొద్ది సేపటి క్రితం అధికారికంగా ఉత్తర్వులను జారీ చేశారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ గా, మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని ఇటీవల కేబినెట్ తీర్మానించింది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం 17 సెప్టెంబర్, 2022 నాటికి 75వ సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటిస్తూ మూడు రోజులపాటు (16, 17, 18 సెప్టెంబర్, 2022) రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది.

  ఈ వజ్రోత్సవాల ముగింపు వేడుకలను వచ్చే ఏడాది 2023 సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభంలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్ ఈ విధంగా నిర్ణయించింది. సెప్టెంబర్ 16వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ, యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలి. సెప్టెంబర్ 17వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండా ఆవిష్కరణ చేసి ప్రసంగిస్తారు.

  Telangana Gurukul Posts: గురుకుల పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు.. 10 వేల పోస్టులకు ముందడుగు..!

  అదే రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటి, పంచాయతీ కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. అదే రోజు (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం, హైదరాబాద్ లోని బంజారా భవన్, ఆదివాసీ భవన్ ల ను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభిస్తారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా ఇందిరా పార్కు వద్దగల ఎన్టీఆర్ స్టేడియం వరకు గుస్సాడీ గోండు లంబాడీ తదితర కళారూపాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపు ఉంటుంది.

  అనంతరం అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయాలి. కవులు కళాకారులను గుర్తించి సత్కరించాలి. ఘనంగా 'తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ' స్ఫూర్తిని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Cs somesh kumar, Holidays, JOBS, Telangana Government

  ఉత్తమ కథలు