Home /News /jobs /

TELANGANA GOVERNMENT DECIDED NOT TO IMPLEMENT DETENTION SYSTEM FOR DEGREE 1ST AND 2ND YEAR STUDENTS SS

Degree Exams: తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్

Degree Exams: తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్
(ప్రతీకాత్మక చిత్రం)

Degree Exams: తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

Covid 19 Impact | షెడ్యూల్ ప్రకారం ఈ సమయానికి డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా కాలేజీలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్ నెలకొంది. తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు ఊరట కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. పలు విశ్వవిద్యాలయాల్లో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ఈసారి డిటెన్షన్ సిస్టమ్‌ను తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే పరీక్ష ఫలితాలతో సంబంధం లేకుండా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సెకండియర్‌కు, సెకండ్ ఇయర్ విద్యార్థులు, థర్డ్ ఇయర్‌కు వెళ్లొచ్చు. ఆ తర్వాత ఏడాదిలో విద్యార్థులు బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నియమం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వర్తించదు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు డిగ్రీ పట్టా పొందాలంటే అన్ని పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. నియమనిబంధనల ప్రకారం విద్యార్థులు పై తరగతికి ప్రమోట్ కావాలంటే 50 శాతం క్రెడిట్స్ పొందాలి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తాం. కానీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు డిటెన్షన్ సిస్టమ్ ఉండదు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే మేము విద్యార్థులకు స్నేహపూర్వకంగా ఉండాలని భావించాం. అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రం వారి డిగ్రీ పొందడానికి అన్ని పరీక్షలు క్లియర్ చేయాలి.
    ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్


    ఇక ఇప్పటికే ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం పలు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్స్-CETs నోటిఫికేషన్లను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి. ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ పరీక్షల్ని నిర్వహించే ఆలోచనలో ఉంది. ముందుగా డిగ్రీతో సంబంధం లేని ఎంసెట్, ఈసెట్ నిర్వహిస్తాయి. డిగ్రీతో సంబంధం ఉన్న సెట్స్‌ని డిగ్రీ పరీక్షల తర్వాత నిర్వహిస్తుంది.

    Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Telangana Jobs: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్... ఉచితంగా కోర్సులు

    Best Coding Courses: కోడింగ్ నేర్చుకోవాలా? ఆన్‌లైన్ కోర్సులు ఇవే...

    Jobs: డిగ్రీ, బీటెక్, పీజీ అర్హతతో జాబ్స్... దరఖాస్తు గడువు పొడిగింపు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

    తదుపరి వార్తలు