Home /News /jobs /

TELANGANA GOVERNMENT APPROVED TO RELEASE NOTIFICATION FOR ANOTHER 10 THOUSAND VACANCIES NS

Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కార్ అనుమతులు.. ఏ శాఖలో అంటే?

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

సీఎం కేసీఆర్ (పాత ఫొటో)

తెలంగాణలో మ‌రో 10వేల ఉద్యోగాల (Telangana Jobs) భ‌ర్తీకి కేసీఆర్ సర్కార్ అనుమ‌తులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  తెలంగాణలోని ఉద్యోగార్థులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. మ‌రో 10వేల ఉద్యోగాల భ‌ర్తీకి (Telangana Government Jobs) అనుమ‌తులు మంజూరు చేసింది. ఇందులో గురుకులాలకు సంబంధించిన మొత్తం 9,096 పోస్టులున్నాయి. మైనార్టీ గురుకుల విద్యాలయాల సంస్థలో 1,445 పోస్టులు, బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 ఉద్యోగాల (Jobs) భ‌ర్తీకి స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. టీఎస్పీఎస్సీ (TSPSC) ద్వారా మ‌రో 995 పోస్టులు భ‌ర్తీ చేసేందుకు సైతం సర్కారు నుంచి అనుమ‌తి ల‌భించింది. తాజా లెక్కలతో కలిపి ఇప్ప‌టివ‌ర‌కూ వివిధ శాఖ‌ల్లో ఉన్న‌ 45,325 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

  10,105 ఖాళీల భర్తీకి తాజాగా అనుమతులు మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. కొందరు చేసే ఉద్యోగ ప్రకటనలు కేవలం జూమ్లా అంటూ కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా ఈ సందర్భంగా మంత్రి హరీశ్ విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం 45325 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిందని తెలిపారు. త్వరలో మరిన్ని జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తామని మంత్రి చెప్పారు.
  RRB Recruitment: రైల్వేలో వివిధ పోస్టులకు 57,117 మంది షార్ట్‌లిస్ట్.. వీరిలో 4,368 మంది మహిళా అభ్యర్థులు..!  తెలంగాణలో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన కేసీఆర్ సర్కార్ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు (Police Jobs), 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు (TSPSC Group 1) నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది. ఈ నెల 7న 1,433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. మున్సిపాలిటీ, మంచాయతీ రాజ్ శాఖల్లో హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: CM KCR, JOBS, Telangana government jobs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు