హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ ప్రకటించిన కేసీఆర్ సర్కార్.. ఇలా అప్లై చేసుకోండి

TS Govt Jobs: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్.. స్కాలర్ షిప్ ప్రకటించిన కేసీఆర్ సర్కార్.. ఇలా అప్లై చేసుకోండి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కేసీఆర్ సర్కార్ (KCR Government) శుభవార్త చెప్పింది. ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇంకా స్కాలర్ షిప్ కూడా ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  రాష్ట్రంలో 83 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో మునిగిపోయారు. లక్షలాది మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. దీన్ని ఆసరా చేసుకున్న కోచింగ్ సెంటర్లు నిరుద్యోగుల నుంచి వేలకు వేల ఫీజును వసూలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వమే నిరుద్యోగులకు ఫ్రీగా కోచింగ్ సెంటర్లు ఇవ్వాలన్న డిమాండ్ వివిధ వర్గాల నుంచి వస్తుంది. అయితే పోలీస్ శాఖ తరఫున ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్ లు పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా అనేక మంది ప్రజా ప్రతినిధులు సైతం వారి వారి ప్రాంతాల్లో ఫ్రీగా కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే బీసీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

  ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంత్రి గంగుల కమలాకర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత, ఆసక్తి కలిగిన బీసీ అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదే రోజు అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తామని చెప్పారు. 21వ తేదీ నుంచి అభ్యర్థులకు కోచింగ్ ప్రారంభమవుతుందని మంత్రి వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని 16 స్ట‌డీ స‌ర్కిళ్ల‌లో 25 మంది చొప్పున ఆఫ్‌లైన్ విధానంలో క్లాసులు నిర్వ‌హించనున్నట్లు మంత్రి చెప్పారు. మ‌రో 50 వేల మందికి ఆన్‌లైన్ ద్వారా ఆన్లైన్ విధానంలో క్లాసులు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

  అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/https://mjpabcwreis.cgg.gov.in/ లింక్ ల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

  Telangana Government: పోటీ పరీక్షల కోసం స్కాలర్ షిప్‌లతో పాటు ఉచిత శిక్షణ తరగతులు.. ప్రభుత్వం ఏర్పాట్లు..

  ఈ సందర్భంగా మంత్రి నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఆదాయం కలిగిన వారికి ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 కోచింగ్ కు ఎంపికయ్యే 10 వేల మందికి ఉపకారవేతనం అందించనున్నట్లు ప్రకటించారు మంత్రి. గ్రూప్-1 కోచింగ్ కు ఎంపికైన వారికి ఆరు నెలల పాటు రూ.5 వేల చొప్పున, గ్రూప్ 2 కోచింగ్ కు ఎంపికైన వారికి నెలకు రూ.2 వేల చొప్పున స్టైఫండ్ అందించనున్నట్లు మంత్రి వివరించారు. అయితే గ్రూప్ 1 అభ్యర్థులకు ఆరు నెలల పాటు, గ్రూప్ 2 అభ్యర్థులకు 3 నెలల పాటు ఈ స్కాలర్ షిప్ ను ఇస్తామని మంత్రి చెప్పారు. ఎస్ఐ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వారికి నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తామన్నారు.

  First published:

  Tags: CM KCR, Job notification, JOBS, Telangana government jobs

  ఉత్తమ కథలు