Home /News /jobs /

TELANGANA GOVERNMENT ANNOUNCED RS 1 LAKH REIMBURSEMENT FOR COVID 19 TREATMENT TO EMPLOYEES NS

Telangana: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. పూర్తి వివరాలివే..

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)

Telangana Government Employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులతో పాటు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగేలా కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

    తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులతో పాటు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగేలా కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా సోకిన అనే మంది వివిధ ఆస్పత్రుల్లో చేరి లక్షల కొద్ది రూపాలు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. అనేక మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సైతం కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వం అందించే హెల్త్ స్కీమ్స్ లో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో వారంతా లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ ఇలాంటి వారికి ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుంది. కరోనా సోకి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారిపై ఆధరపడే వారికి రూ. లక్ష వరకు రీయింబర్స్‌మెంట్‌ అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా దీనికి సంబంధించిన మెమో జారీ చేశారు. జీవోను విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. మంగళవారం ఒక్కరోజే 51, 997 మందికి టీకాలు వేశారు. జనవరి 16 నుంచి ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 69,625కు చేరిందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాస్ రావు తెలిపారు. వ్యాక్సినేషన్ తొలిరోజున (జనవరి 16) 140 కేంద్రాలు, రెండో రోజు (జనవరి 18)న 335 కేంద్రాల్లో టీకాలు వేశారు. ఇక మూడో రోజు (జనవరి 19) ఏకంగా 894 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. ఒక్కో వ్యాక్సినేషన్ కేంద్రంలో గరిష్ఠంగా 100 టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మంగళవారం టీకా వేయించుకునేందుకు 73,673 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 71శాతం మంది టీకా వేయించుకున్నారు.

    అంటే మంగళవారం ఒక్కరోజే 51,997 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం టీకాలను తీసుకున్న వారిలో 51 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఐతే అందరికీ చిన్న చిన్న సమస్యలే వచ్చాయి. తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు. ఆందోళన, భయం వల్లే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇది సర్వ సాధారణమని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Telangana, Telangana employees, Telangana Government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు