Home /News /jobs /

TELANGANA GOVERNMENT ALLOCATING 8000 CRORE RUPEES IN BUDGET FOR PRC TO EMPLOYEES HERE FULL DETAILS NS

Telangana PRC: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. బడ్జెట్లోని ఆ రూ. 8 వేల కోట్లు పీఆర్సీ కోసమే?

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇస్తామని.. ఈ విషయమై మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తానని అసెంబ్లీలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే..

    పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో శాసనసభలోనే ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు ఈ విషయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 29 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తారన్న ఊహాగానాలు సైతం జోరుగా సాగుతున్నాయి. అయితే.. ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ బడ్జెట్ ను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఆర్థిక, ప్రణాళిక శాఖకు బడ్జెట్లో రూ. 45,923 కోట్లను నిర్దేశించారు. అయితే రూ. 8 వేల కోట్లను మాత్రం నిర్వహణ పద్దు కింద చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కేసమే కేటాయిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది.

    పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ఆ నిధులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.అయితే ఉద్యోగుల వేతన సవరణ అంశంపై బడ్జెట్లో ప్రభుత్వం ఎక్కడ ప్రస్తావించలేదు. ఉద్యోగులు పదవీ విరణమ వయస్సును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచితే మరో రూ.3 వేల కోట్ల వరకు ఆయా ఉద్యోగులకు అందించే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించడం వాయిదా పడుతుంది. ఆ మొత్తాన్ని పీఆర్సీ కోసం వినియోగించే అవకాశం ఉంది.

    ఇదిలా ఉంటే.. తెలంగాణ సర్కారు కూడా గల్ఫ్ కార్మికుల కష్టాలను తీర్చేందుకు ముందుకొచ్చింది.  గురువారం ప్రవేశ పెట్టిన తెలంగాణ బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల గురించి కేసీఆర్ సర్కారు ప్రత్యేకంగా ప్రస్తావించింది. బడ్జెట్లో 122వ అంశంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను పొందుపరిచారు. ‘తెలంగాణ ప్రాంతం నుండి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులను సానుభూతితో ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందం పర్యటించి వచ్చింది. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని బడ్జెట్లో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Harish Rao, Telangana, Telangana Budget, Telangana employees

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు