హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS Police Recruitment 2022: పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం, అర్హత వివరాలిలా..

TS Police Recruitment 2022: పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం, అర్హత వివరాలిలా..

TS Police Recruitment 2022: పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం, అర్హత వివరాలిలా..

TS Police Recruitment 2022: పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం, అర్హత వివరాలిలా..

తెలంగాణ(Telangana) పోలీస్ శాఖకు సంబంధించిన తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్‌లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు 32 ఖాళీగా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణ(Telangana) పోలీస్ శాఖకు సంబంధించిన తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ల్యాబొరేటరీస్‌లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు 32 ఖాళీగా ఉన్నాయి. వీటిలో సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తారు. వీటిని పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో నియామకాలు జరనున్నాయి. ఆఫ్ లైన్(Offline) విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. ఒక సంవత్సరం వ్యవధికి మాత్రమే సేఫ్ సిటీ ప్రాజెక్ట్, హైదరాబాద్ సిటీ పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19, 2022 నుంచి అక్టోబర్ 10, 2022 మధ్య నిర్ణీత ప్రొఫార్మాలో ఆఫ్ లైన్ విధానంలో తెలంగాణ రాష్ట్ర ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ లిమిటెడ్, హైదరాబాద్ అడ్రస్ కు పంపించాలి. పూర్తి సమాచారం కొరకు www.tspolice.gov.in వెబ్ సైట్ తనిఖీ చేయవచ్చు. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 19న విడుదల చేశారు. పూర్తి వివరాలను తెలుసుకుందాం..

WIPRO: విప్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జీతాల పెంపు.. ఎంత శాతం పెరుగుతాయంటే..

మొత్తం ఖాళీలు.. 32 పోస్టులు

విభాగాల వారీగా ఇలా..

సైంటిఫిక్ ఆఫీస్( DNA) -02

సైంటిఫిక్ అసిస్టెంట్ ( DNA) - 04

ల్యాబ్ అసిస్టెంట్ ( DNA) -02

సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజికల్ డివిజన్) -03

సైంటిఫిక్ అసిస్టెంట్(బయాలజికల్ డివిజన్) -03

ల్యాబ్ అసిస్టెంట్ (బయాలజి డివిజన్) -04

సైంటిఫిక్ ఆఫీసర్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) -02

సైంటిఫిక్ అసిస్టెంట్(సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) -06

ల్యాబ్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్ డివిజన్) - 02

సైంటిఫిక్ అసిస్టెంట్(కెమికల్ డివిజన్) - 04

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి యొక్క అర్హతలు పోస్టును బట్టి ఉన్నాయి.

బయాలజీతో ఎమ్మెస్సీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో 65 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి.

బయాలజీ లేదా జువాలజీ లేదా బయో టెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ , బోటనీ లేదా జెనెటిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా అర్హులుగా పేర్కొన్నారు.

ఇక సైంటిఫిక్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు కంప్యూటర్ సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేస్తే సరిపోతుంది. బీటెక్ డిగ్రీ వాళ్లు కూడా అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఫీజు వివరాలు..

1. సైంటిఫిక్ ఆఫీసర్ , సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే.. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.

2. ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 400 డీడీ తీయాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200చెల్లించాలి.

డిమాండ్ డ్రాఫ్ట్ లను “Director Forensic Science

Lab, Hyderabad” పేరుతో తీయాలి.

Online Learning Apps: విద్యార్థులకు అలర్ట్.. ఈ యాప్స్ లో అన్ని తరగతుల వారికి, ఉద్యోగాలకు బెస్ట్ కోచింగ్

జీతం..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30 వేల నుంచి రూ.45 వేల మధ్యలో చెల్లిస్తారు.

వయోపరిమితి..

అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 1st of July 2022లోపు ఈ వయస్సు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం 5 ఏళ్ల వయో సడలింపు ఉంటుందని పేర్కొన్నారు.

ఎంపిక విధానం..

దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి.. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

Jobs In IRCTC: IRCTCలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు .. ఆకర్షణీయమైన జీతం..

దరఖాస్తు విధానం..

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను అక్టోబర్ 10, 2022 సాయంత్రం 5 గంటల లోగా పంపించాలి. విద్యార్హత సర్టిఫికెట్లను అప్లికేషన్ ఫారమ్ తో జత చేసి.. The Director, Telangana State Forensic Laboratories Red Hills, Nampally, Hyderabad – 004 అడ్రస్ కు పంపించాలి.

ఎన్వలప్ పై APPLICATION FOR THE POST OF (NAME OF THE POST& POST

CODE)ఈ ఫార్మాట్ లో దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.tspolice.gov.in వెబ్ సైట్ సదర్శించి తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.

-ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, Telangana government jobs, Telangana jobs, Tslprb

ఉత్తమ కథలు