Home /News /jobs /

TELANGANA FINANCE MINISTER KEY ANNOUNCEMENT OVER GROUP 4 NOTIFICATION HERE DETAILS NS

Telangana Group-4 Notification: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 నోటిఫికేషన్ పై ఆర్థిక మంత్రి హరీశ్ కీలక ప్రకటన

మంత్రి హరీశ్ రావు (ఫైల్ ఫొటో)

మంత్రి హరీశ్ రావు (ఫైల్ ఫొటో)

తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ (Telangana Group 4 Notification) పై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు (Telangana Government Jobs) సంబంధించిన ప్రకటను వరుసగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే 9 వేలకు పైగా ఖాళీలు ఉన్న గ్రూప్-4 నోటిఫికేషన్ (TSPSC Group-4 Notification) కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు తాజాగా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల అవుతుందని వెల్లడించారు. ఇందుకోసం నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇటీవల టెట్ (TS TET 2022) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులతో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ రాకముందే లాంగ్ టర్మ్ శిక్షణ ఇప్పిస్తామని భరోసానిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో టెట్ పరీక్షలో 32శాతం ఉత్తీర్ణత నమోదైందన్నారు. అయితే.. కేవలం సిద్ధిపేటలో నిర్వహించిన కేసీఆర్ ఉచిత శిక్షణ కేంద్రంలోనే 82 శాతం ఉత్తీర్ణత సాధించారని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన 618 మంది అభ్యర్థుల్లో 517 మంది పాస్ అయ్యారని మంత్రి వివరించారు.

    ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ రాబోతోందని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. దానికి సైతం మీరంతా సంసిద్ధంగా ఉండాలని అభ్యర్థులకు సూచించారు హరీశ్ రావు. మీరు ఉద్యోగాలు సాధించినప్పుడే ఈ కేసీఆర్ శిక్షణకు నిజమైన సార్థకత లభిస్తుందని మంత్రి అన్నారు. ఈసారి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు చాలా అదృష్టవంతులని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని మంత్రి వివరించారు. 317 జీఓను రద్దు చేయాలని, దాని అంతర్యం తెలియకుండా.. ప్రతిపక్షాలు ఆందోళన చేయడం సిగ్గుచేటని మంత్రి విమర్శలు గుప్పించారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల 50వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మంత్రి అన్నారు. వెంటనే ఆ ఖాళీలను భర్తీ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
    CM KCR | Telangana jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాదికే లక్ష 50 వేలు ఉద్యోగాలకు గాను.. ఇప్పటికే లక్షా 30 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఈ యేటా మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగం అని అన్నారు. యువతను నిర్వీర్యం, మోసం చేయడానికే ఈ అగ్నిపథ్ పథకం తెచ్చారని మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమ్మడం తప్ప కొత్తగా తెచ్చేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

    APPSC Notifications: ఏపీలో ఉద్యోగాల జాతర.. వచ్చే నెలలో గ్రూప్-1, 2 నోటిఫికేషన్లు.. మరో 13 నోటిఫికేషన్లు కూడా..

    ఏ రంగానికి కూడా బీజేపీ ప్రభుత్వం మేలు చేయలేదని ధ్వజమెత్తారు. రూపాయి విలువ పతనమై.. దేశంలో 8.7 శాతం నిరుద్యోగ సమస్య ఉన్నదని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడంలో బీజేపీ ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని ధ్వజమెత్తారు. సిద్దిపేట అంతా నా కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నానని మంత్రి ఈ సందర్భంగా అన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Harish Rao, JOBS, Telangana government jobs, TS TET 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు