తెలంగాణలో 80 వేలకు పైగా ఉద్యోగాలను (Telangana Government Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింన కేసీఆర్ సర్కార్ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు (Police Jobs), 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు (TSPSC Group 1) నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది. తాజాగా మరో 1,433 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ ఉద్యోగాల (Jobs) భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. మున్సిపాలిటీ, మంచాయతీ రాజ్ శాఖల్లో హెల్త్ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది.
ఈ సమయంలో తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురును మంత్రి హరీశ్‌రావు (Harish Rao)ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ (Health Department)లో భారీగా 1,326 పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ మేరకు సం బం ధిత అధికారులతో మం త్రి సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి , డీఎం ఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, ఇతర ఉన్న తాధికారులతో మం త్రి సమీక్షిం చారు. వైద్యా రోగ్య శాఖలో మొత్తం 12,755 పోస్టులు ఖాళీగా ఉన్న ట్టు గుర్తిం చగా.. తొలి దశలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ బోర్డును ఆదేశిం చారు. ఇం దుకోసం ఎలాంటి న్యా యపరమైన సమసయలు తలెత్తకుండా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. TS Police Recruitment 2022: అభ్యర్థులకు అలర్ట్.. పోలీస్ జాబ్స్ అప్లికేషన్లో మరో ఆప్షన్.. రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన
ముఖ్యంగా వైద్యారోగ్య విభాగం, టీవీవీపీ, వైద్య విద్య, ప్రజారోగ్యం విభాగాల్లో భర్తీ చేయనున్న ఈ 1,326 పోస్టుల్లో.. టెక్ని కల్, ల్యా బ్ అసిస్టెం ట్, జూనియర్ అసిస్టెం ట్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు సమాచారం. నిమ్స్‌లోని ఖాళీలు నిమ్స్ బోర్డు ద్వా రా, ఆయుష్ సహా మిగతా అన్ని పోస్టులను మెడికల్ నియామక బోర్డు ద్వా రా భర్తీ చేయనున్నరు. అంతే కాకుండా కరోనా కాలంలో సేవలం దిం చిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగాల భర్తీలో 20శాతం వెయిటేజీ ఇవ్వా లని నిర్ణయించినట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయుష్ వైద్యులను టీచింగ్ స్టాఫ్‌గా మార్చే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ఆయుష్ సర్వీస్‌లో మార్పులు చేసి కొత్త పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ద్వారా పని చేసే వారి వివరాలు వెంటనే ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.