Coronavirus: తెలంగాణ ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా

తెలంగాణ గురుకుల ఐదో తరగతి ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు గురుకులాల కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు.

news18-telugu
Updated: March 25, 2020, 2:53 PM IST
Coronavirus: తెలంగాణ ఐదో తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12వ తేదీని నిర్వహించాల్సిన తెలంగాణ గురుకుల ఐదో తరగతి ప్రవేశ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు టీజీసెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. తిరిగి పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. విద్యార్థులతో పాటు తెలంగాణ వాసులందరూ కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు