Home /News /jobs /

TELANGANA ELECTRICITY JOBS TSSPDCL RELEASED NOTIFICATION FOR 1000 JUNIOR LINEMEN JOBS VACANCIES HERE FULL DETAILS NS

Telangana Electricity Jobs: తెలంగాణలో విద్యుత్ ఉద్యోగాల జాతర.. 1000 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు, ఇతర వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Jobs Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, అర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలో విద్యుత్ శాఖలో కొలువు జాతర జోరుగా సాగుతోంది. తాజాగా దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TSSPDCL) మరో 1000 జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు పక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. అప్లై చేసుకోవడానికి జూన్ 8ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    విద్యార్హతల వివరాలు:
    టెన్త్ తో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌, వైర్‌మెన్‌ లేదా ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ లో ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు అధికారులు.
    వయో పరిమితి:
    ఈ ఉద్యోగాలకు దరఖాస్తుదారుల వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
    దరఖాస్తు ఫీజు: ప్రతీ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఎగ్జామ్ ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.
    Telangana Jobs: తెలంగాణ కొలువుల జాతర.. మరో 1271 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

    ఖాళీలు ఉన్న జిల్లాలివే..
    మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ-గద్వాల్, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి.


    ముఖ్యమైన తేదీలు:
























    ఫీజు చెల్లింపులు ప్రారంభం మే 19
    దరఖాస్తులు ప్రారంభం మే 19
    దరఖాస్తులకు ఆఖరి తేదీ జూన్‌ 8
    హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్ జూలై 11
    రాత పరీక్ష జూలై 17

    దరఖాస్తుల వివరాలు:
    ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 19 నుంచి ప్రారంభం అవుతుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ https://tssouthernpower.cgg.gov.in లో అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 11 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతర జూలై 17 వారికి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు