Home /News /jobs /

TELANGANA EDUCATION MINISTRY AND CBSE TO ALLOW STUDENTS TO CARRY MASKS AND HAND SANITISERS DURING BOARD EXAMS BS

మాస్కు ధరించి పరీక్షలకు హాజరవ్వండి.. విద్యార్థులకు సూచనలు..

హాల్ టికెట్లను మళ్లీ కూడా bie.ap.gov.in లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

హాల్ టికెట్లను మళ్లీ కూడా bie.ap.gov.in లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

అవసరం అనుకుంటే విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షకు హాజరు కావాలని సీబీఎస్‌ఈ, తెలంగాణ విద్యాశాఖ చెప్పాయి. వీలైతే శానిటైజర్లు కూడా వెంట తెచ్చుకోవచ్చని.. దీనికి అభ్యంతరం లేదని స్పష్టం చేశాయి.

    కరోనా వైరస్ ప్రభావంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, ప్రైవేటు సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. తప్పనిసరి అయితే తప్ప రద్దీ ప్రదేశాల్లో తిరగవద్దని సూచనలు చేశాయి. తాజాగా.. పరీక్షలు ప్రారంభం అవుతున్న తరుణంలో విద్యాశాఖ కూడా విద్యార్థులకు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. సీబీఎస్‌ఈ, తెలంగాణ విద్యాశాఖ వేర్వేరుగా విద్యార్థులకు సూచనలు ఇస్తూ ప్రకటన విడుదల చేశాయి. అవసరం అనుకుంటే విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షకు హాజరు కావాలని చెప్పాయి. వీలైతే శానిటైజర్లు కూడా వెంట తెచ్చుకోవచ్చని.. దీనికి అభ్యంతరం లేదని స్పష్టం చేశాయి.
    సీబీఎస్‌ఈ ప్రకటన

    అటు.. నీళ్ల బాటిల్ కూడా వెంట తెచ్చుకోవాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. దీనికి టీచర్లు, తనిఖీ అధికారులు అభ్యంతరం చెప్పబోరని వెల్లడించింది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: CBSE, EDUCATION, Exams, Students\, Telangana, Trending

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు