TELANGANA EDUCATION MINISTER SABITHA REDDY GIVES CLARITY ON POSTPONE OF TS TET 2022 EXAM DATE NS
TS TET Exam: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్... పరీక్ష వాయిదాపై మంత్రి కీలక ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో టెట్ ఎగ్జామ్ తేదీలను (TS TET Exam Dates) మార్చాలని వస్తున్న వినతులపై మంత్రి సబితారెడ్డి (Minister Sabitha Reddy) తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో టెట్ (TS TET 2022) ఎగ్జామ్ వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జూన్ 12న టెట్ ను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించంది. అయితే, అదే రోజు RRB ఎగ్జామ్ కూడా ఉండడంతో ఆ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టెట్ ను వాయిదా వేయాలని కోరుతున్నారు. తాజాగా ఓ అభ్యర్థి ఈ విషయంపై మంత్రి కేటీఆర్ కు (Minister KTR) ట్వీట్ చేశారు. దీంతో స్పందించిన కేటీఆర్.. ఈ విషయాన్ని పరిశీలించాలని మంత్రి సబితారెడ్డిని ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే.. మంత్రి సబితారెడ్డి ఈ అంశంపై స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు.
వివిధ పోటీ పరీక్షల తేదీలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే టెట్ ఎగ్జామ్ తేదీలను ఖరారు చేసినట్లు సబిత చెప్పారు. మంత్రి ప్రకటనతో టెట్ ఎగ్జామ్ వాయిదాపై జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లైంది. దీంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం జూన్ 12న తేదీనే టెట్ ఎగ్జామ్ జరుగుతుందని స్పష్టమైంది. TSTET 2022 PAPER II SYLLABUS: టెట్ కు అప్లై చేశారా? పేపర్ 2 గురించి ఈ విషయాలు తెలుసుకోండి
టెట్ కు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సైతం ఈ నెల 12న ముగిసింది. టెట్ కు సంబంధించి మొత్తం 6,26,928 దరఖాస్తులు వచ్చినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే టెట్ ను ఈ సారి పది భాషల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులకు బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్లను అందించనున్నారు. అంటే ఒకే పేపర్లో తెలుగు/సంస్కృతం, తెలుగు/ఇంగ్లీష్, ఇంగ్లీష్/ఉర్దు ఇలా రెండు భాషల్లో ప్రశ్నలు ఉంటాయి.
తమిళం, తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, మరాఠీ భాషల్లో టెట్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే తెలుగు/ఇంగ్లీష్‌లో 5,71,986 మంది అత్యధికంగా ఎగ్జామ్ రాయనున్నారు. ఇందులో పేపర్ 1కు సంబంధించి 3,26,288 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్ 2కు సంబంధించి 2,45,698 మంది ఎగ్జామ్ (Exam) .రాయనున్నారు. ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవనున్న నేపథ్యంలో అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.