హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS CETs-2023: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. EAMCET, ICET, LAWCET, ECET తదితర అన్ని పరీక్షల తేదీలివే..

TS CETs-2023: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. EAMCET, ICET, LAWCET, ECET తదితర అన్ని పరీక్షల తేదీలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఎంసెట్, ఐసెట్, లాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ తదితర అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఈ రోజు విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల (Exams) కాలం మొదలైంది. వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధిచిన ఎంసెట్ (EAMCET), ఐసెట్(ICET), ఎడ్ సెట్(Ed.Cet), లాసెట్ (LAW CET), పీజీఈసెట్ తదితర అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

TS EAMCET-2023: రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఉన్నత విద్యామండలి జేఎన్టీయూహెచ్ కు అప్పగించింది. ఇంజనీరింగ్ కు సంబంధించిన ఎగ్జామ్ ను మే 7 నుంచి 11 వరకు.. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్ ను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు.

JEE Main 2023: మొదలైన జేఈఈ మెయిన్ సెషన్-2 రిజిస్ట్రేషన్స్‌.. అప్లికేషన్‌ ప్రాసెస్‌, ఇతర వివరాలిలా..

TS Ed.CET-2023: బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఈ పరీక్షను ఈ ఏడాది మాహత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ పరీక్షను మే 18న నిర్వహించనున్నారు.

TS ECET-2023: ఇంజనీరింగ్ కోర్సుల్లో డిప్లొమా అభ్యర్థుల లేటరల్ ఎంట్రీకి సంబంధించిన ఈసెట్ ఎగ్జామ్ ను మే 20న నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఈ సారి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

TS LAWCET-2023: మూడేళ్ల, ఐదేళ్ల లాకోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించిన పరీక్షను మే 25న నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.

TS PGECET-2023: ఈ ఏడాది మే 25న ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ ను నిర్వహించనుంది.

TS ICET-2023: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఈ ఎగ్జామ్ ను ఈ సారి కాకతీయ యూనివర్సిటీ నిర్వహించనుంది. మే 26, 27 తేదీల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది.

TS PGECET-2023: ఎంటెక్, ఎం.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షను ఈ ఏడాది జేఎన్టీయూహెచ్ నిర్వహించనుంది. మే 29 నుంచి 31 వరకు ఇంకా జూన్ 1 న ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, ముఖ్యమైన తేదీలు ఇతర వివరాలతో కూడిన పూర్తి నోటిఫికేషన్ ను సంబంధిత సెట్ కన్వీనర్లు ప్రకటించనునున్నారు.

First published:

Tags: Career and Courses, Exams, JOBS, Ts eamcet

ఉత్తమ కథలు