Education : నేడు విద్యాశాఖ కీలక సమావేశం..ఫీజులు, విధివిధానాలపై చర్చ..

సబితారెడ్డి(ఫైల్ ఫొటో)

Education : అన్ని విద్యాసంస్థలను జులై ఒకటి నుండి ప్రారంభించాలని ప్రకటించడంతో అందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో అధికారులు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు సమావేశం కానున్నాయి..ఓ వైపు కొవిడ్ ధర్డ్ వేవ్ అంటూ నిపుణులు చెబుతున్నా విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

  • Share this:
కరోనా ప్రభావం తగ్గింది..అన్ని వ్యాపార సంస్థలు ప్రారంభమయ్యాయి. అయితే దేశం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య విద్యార్థులు..వారికి ఇంకా టీకా రాలేదు..18 సంవత్సరాల లోపు వారికి ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయినా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జులై ఒకటి నుండి అన్ని విద్యా సంస్థలను తిరిగి ఓపెన్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.

ప్రకటన అయితే చేశారు కాని, ఇంకా వాటిపై ఎలాంటీ గైడ్‌లైన్స్ ప్రకటించలేదు. స్కూళ్లు తెరవడం వల్ల కలిగే ఇబ్బందులతో పాటు పిల్లల ఫీజులు, ఆన్‌లైన్ విధానం అమలు ఎలా ఉండాలనే దానిపై స్పష్టత లేదు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు ఉన్నతాధికారులు, విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు.

విద్యాలయాలు దశల వారిగా ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఆయా స్కూళ్లు అనుసరించాల్సిన విధివిధానాలు, ఫీజులతో పాటు కొవిడ్ తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఇంటర్ ,డిగ్రీ , పీజీ కాలేజిల్లో డైరక్టు క్లాసులను నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను పరీశీలించనున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆన్‌లైన్ తరగతులపై కూడా స్పష్టత రానుంది.

మరోవైపు ఆన్​లైన్, ఆఫ్ లైన్ రెండూ సమాంతరంగా నిర్వహించడం కష్టమనే చర్చ జరుగుతోంది. కాబట్టి ఆన్​లైన్ కాకుండా కేవలం ఆఫ్‌లైన్ బోధన చేపట్టడం సాధ్యమా అనే అంశాన్ని కూడా విద్యా శాఖ పరిశీలిస్తోంది. ఇక ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేసే ఫీజులను జీవో 46ను కొనసాగించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ జీవో ప్రకారం ప్రస్తుత ఫీజుల్లో ముప్పై శాతం మేర తగ్గించి తీసుకోవాలని ప్రభుత్వం కోరనుంది..దీంతోపాటు టర్మ్‌ల వారిగా కాకుండా నెలవారిగా ఫీజులు వసూలు చేయాలని కూడా కోరనున్నారు. అయితే ప్రభుత్వం సూచనలపై ప్రైవేటు విద్యా సంస్థలు ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాలి..

అయితే.. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్కూళ్లు..వారు చెప్పినట్టు అంగీకరించినా...రాష్ట్ర ప్రభుత్వాల ఆదీనంలోని సీబిఎస్‌ఈ, ఐసీఎస్ఈ విద్యా వ్యవస్థల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది.దీంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌పై కూడా పలు నిర్ణయాలు వెలువడనున్నాయి.

ముఖ్యంగా పీఈటీ టిచర్స్, ఆర్ట్స్, క్రాఫ్ట్, లాంటీ ప్రత్యక్ష భోదనతో సంబంధం ఉన్న వారిని తీసుకోవాలా వద్దా అనేది నేడు తేలనుంది..అయితే వారికి ఈ సంవత్సరం కూడా బ్రేక్ వేయాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకు రానుంది. దీంతో విద్యా వాలంటిర్ల నియామకంపై కూడా సందిగ్ధత నెలకొంది..సో వీటన్నింటీపై నేటి సమావేశంలో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Published by:yveerash yveerash
First published: