TELANGANA EDUCATION DEPARTMENT RELEASED NOTIFICATIONS FOR MODEL SCHOOL ADMISSIONS HERE APPLICATION LINK NS
TS Model School Admissions: తెలంగాణ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
Telangana Admissions: తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో (TS Model Schools) అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. విద్యార్థులు అప్లై చేసుకునేందుకు ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మోడల్ స్కూళ్లలో (TS Model Schools) అడ్మిషన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఆయా పాఠశాలల్లో మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందుతుండడంతో చేరేందుకు విద్యార్థులు (Students) పోటీపడుతుంటారు. ఈ మోడల్ స్కూళ్లలో టెన్త్ నుంచి ఇంటర్ వరకు సెమీ రెసిడెన్షియల్ విధానంలో విద్యా బోధన ఉంటుంది. తాజాగా తెలంగాణలోని (Telangana) 194 మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి ఖాళీల భర్తీకి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో ప్రవేశాలను నిర్వహించనున్నారు. దీంతో మొత్తం 19400 మంది విద్యార్థులకు ప్రవేశాలను నిర్వహించనున్నారు. ఇంకా వివిధ కారణాలతో 7-10 వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు telanganams.cgg.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ.150ను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వికలాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, EWS అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. వారు రూ.75 చెల్లిస్తే సరిపోతుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: ఫిబ్రవరి 8
దరఖాస్తులకు ఆఖరి తేదీ: మార్చి 15
హాల్ టికెట్ల డౌన్ లోడ్:6వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 17 నుంచి, 7-10 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 9 నుంచి..
ప్రవేశ పరీక్ష: 6వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 17న, 7-10 తరగతుల వారికి ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎగ్జామ్ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుంది.
ఇతర ముఖ్యమైన తేదీలు:
ప్రవేశ పరీక్ష ఫలితాలు: మే 20.
స్కూళ్ల వారీగా అభ్యర్థుల ఎంపిక: మే 23.
ఎంపికైన విద్యార్థుల జాబితా ప్రదర్శన: మే 24.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్: మే 24 నుంచి 31 వరకు..
క్లాసుల ప్రారంభం: ఏప్రిల్ 1
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.