TELANGANA EDUCATION DEPARTMENT OFFICIALS KEY ANNOUNCEMENT OVER TENTH EXAMS HERE DETAILS NS
TS Tenth Exams: తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు శుభవార్త.. ఎగ్జామ్స్ ఇక మరింత ఈజీ.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ విషయంలో అధికారులు తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష పేపర్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా(Corona) నేపథ్యంలో గత రెండేళ్లుగా విద్యావ్యవస్థ కుంటు పడింది. దీంతో ఎప్పుడు ఆన్లైన్ క్లాసులు (Online Classes) పెడతారో? ఆఫ్ లైన్ క్లాసులు ఎన్నాళ్ల పాటు ఉంటాయో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో సిలబస్ పూర్తి కాక, ఆన్లైన్ విధానంలో పూర్తి అయిన సిలబస్ సరిగా అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎగ్జామ్స్ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. పరీక్షలపై (Exams) కీలక ప్రకటన చేసింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ఎగ్జామ్ పేపర్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ సారి వార్షిక పరీక్షల్లో కేవలం ఆరు పేపర్లు మాత్రమే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు టెన్త్ ఎగ్జామ్స్ లో విద్యార్థులు మొత్తం 11 ఎగ్జామ్స్ రాసేవారు. ఫస్ట్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, గణితం, జనరల్సైన్స్, సోషల్ స్టడీస్ ప్రశ్నపత్రాలను సింగిల్ పేపర్‌కే పరిమితం చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం 100 మార్కులకు ఆయా పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో 80 మార్కులు బోర్డ్ ఎగ్జామ్స్ కు కేటాయించగా.. 20 మార్కులు ఇంటర్నల్స్ కు ఉంటాయి. హెచ్ఎంలకు టెన్త్ ఎగ్జామ్స్ పై కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో రెగ్యులర్ టెన్త్, ఓపెన్ టెన్త్, ఒకసారి ఫెయిలైన విద్యార్థుల ఆన్‌లైన్ డేటా సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. Tenth, Inter Exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై మంత్రి కీలక ప్రకటన
థియరీ ఎగ్జామ్స్ ను ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందులో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభమై మే 2న ముగియనుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 21న ప్రారంభమై మే 5న ముగియనున్నట్లు తెలిపింది. ఈ ఎగ్జామ్స్ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.