తెలంగాణ (Telangana) లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అలర్ట్ అయిన ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సంబంధించిన సెలవులను (Summer Holidays) తిరిగి పొడిగిస్తారన్న ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతోంది. వాస్తవానికి వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13 నుంచి అంటే రేపటి నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో సెలవులు పొడిగిస్తారా? లేదా రేపటి నుంచి విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిస్తారా? అన్న సందేహం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్రంగా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి (Minister Sabitha Reddy) నిన్న అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను ముందే నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభిస్తామని ఆమె స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి స్వయంగా ప్రకటన చేసినా.. సెలవుల పొడిగింపుపై రూమర్లు ఆగలేదు.
దీంతో తాజాగా విద్యాశాఖ తాజాగా మరో కీలక ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి స్కూళ్లు యధావిధిగా ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. స్కూళ్లకు సెలవుల పొడగింపు ప్రసక్తే లేదని విద్యాశాఖ తేల్చి చెప్పింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు రేపు స్కూళ్లకు హాజరు కావాలని తెలిపింది విద్యాశాఖ. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై సైతం మంత్రి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచే సర్కార్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సబితా రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సోమవారం నుంచి స్కూళ్లను పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
సెలవులు పొడిగింపు ఉండదని మరో మారు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను సోమవారం నుంచి వేసవి సెలవుల అనంతరం తిరిగి తెరుకుకుంటాయని మంత్రి చెప్పారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Sabita indra reddy, Schools reopening, Summer holidays