Home /News /jobs /

TELANGANA ECET 2022 RESULTS RELEASED AND CHECK YOUR RESULTS HERE IS THE RESULTS LINK KNOW DETAILS HERE VB

Telangana Results 2022: విద్యార్థులకు అలర్ట్.. ఆ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

 (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

TS Ecet Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, TS ECET 2022 ఫలితాలు విడుదలయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
TS Ecet Results 2022: తెలంగాణ ఈసెట్ ఫలితాల మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సెట్ లో 90.69 శాతం ఉత్తర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, TS ECET 2022 ఫలితాలు విడుదలయ్యాయి. TSCHE TS ECET 2022 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ - www.ecet.tsche.ac.inలో అందుబాటులో ఉంచారు.  ఈరోజు ఉదయం 11:00 ఈ ఫలితాలను జేఎన్టీయూహెచ్ లో విడుదల చేశారు.   TS ECET 2022 ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులకు వారి అప్లికేషన్ నంబర్, హాల్ టిక్కెట్ నంబర్ మరియు ఇతర పరీక్షా ఆధారాలు అవసరం అవుతాయి.

Police Jobs Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4300 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్..


TS ECET 2022 ఫలితాలతో పాటు తుది సమాధాన కీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫలితాలు www.ecet.tsche.ac.in వెబ్ సైట్ లోనే కాకుండా.. manabadi.co.inలో కూడా అందుబాటులో ఉన్నాయి. TS ECET పరీక్షను TSCHE తరపున జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ నిర్వహించింది.  ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో జూలై 13న నిర్వహించాల్సిన ఈ-సెట్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఈ పరీక్షను ఆగస్టు 1, 2022న నిర్వహించారు.  పాలిటెక్నిక్ డిప్లొమా అభ్యర్థులు బీటెక్‌, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఈ నెల 1న నిర్వహించిన ఈసెట్‌కు 9,402 మంది విద్యార్థులు హాజయ్యారు. వీరిలో 90 శాతానికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

TS Eamcet Results 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..


ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..

Step 1: అభ్యర్థులు మొదటగా https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో రిజల్ట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Step 4: తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.



ఎంసెట్ ఫలితాలు విడుదల ..
ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను గత నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించారు అధికారులు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ జులై 30, 31 తేదీల్లో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన కీని ఇటీవల విడుదల చేసిన అధికారులు.. కీపై అభ్యంతరాలను సైతం స్వీకరించారు. దీనిలో ఇంజనీర్ ఎగ్జామ్ కు 1,56,812 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షకు 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు.

నేడు ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదలను మంత్రి జేఎన్టీయూహెచ్‌లో  విడుదల చేశారు.  విద్యార్థులు https://ecet.tsche.ac.in/ లింక్ ద్వారా తమ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Exam results, JOBS, Results, SSC results, Ts ecet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు