Home /News /jobs /

TELANGANA EAMCET 2022 RESULTS RELEASED AND CHECK YOUR RESULTS HERE IS THE RESULTS LINK KNOW DETAILS HERE VB

TS Eamcet Results 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

TS Eamcet Results 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

TS Eamcet Results 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

TS Eamcet Results 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు ఉదయం 11.00 గంటలకు విడుదలయ్యాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • hyderabad, India
TS Eamcet Results 2022: తెలంగాణ ఎంసెట్ ఫలితాల మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు.  దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు ఉదయం 11.00 గంటలకు విడుదలయ్యాయి.విద్యార్థులు తమ ఫలితాలను www.eamcet.tsche.ac.in వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.  ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను గత నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించారు అధికారులు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ జులై 30, 31 తేదీల్లో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన కీని ఇటీవల విడుదల చేసిన అధికారులు.. కీపై అభ్యంతరాలను సైతం స్వీకరించారు.

Police Jobs Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 4300 పోలీస్ కొలువులకు నోటిఫికేషన్..


ఇదిలా ఉంటే ఈసెట్ ఫలితాలను సైతం నేడు విడుదల కానున్నాయి. ఇంజనీర్ ఎగ్జామ్ కు 1,56,812 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షకు 80,575 మంది విద్యార్థులు హాజరయ్యారు.

SSC CPO Recruitment 2022: మీరు డిగ్రీ పూర్తి చేశారా.. అయితే ఈ ఉద్యోగాలు మీ కోసమే.. SSC ద్వారా ఎంపిక..


ఎంసెట్ ఫలితాలతో పాటు..  ఈ సెట్ ఫలితాలను కూడా మంత్రి విడుదల చేశారు. ఈ సెట్ లో 90.7 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు.  విద్యార్థులు https://ecet.tsche.ac.in/ లింక్ ద్వారా తమ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.



ఎంసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు..

Step 1: అభ్యర్థులు మొదటగా https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో రిజల్ట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3: అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

Step 4: తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Exam results, JOBS, Telangana government jobs, TS EAMCET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు