TELANGANA EAMCET 2022 ALERT FOR TS STUDENTS EXAM APPLICATION DEADLINE ENDS TODAY EVK
Telangana Exams: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష దరఖాస్తుకు ఈ రోజే ఆఖరు
(ప్రతీకాత్మక చిత్రం)
Telangana EAMCET 2022 | తెలంగాణ ఎంసెట్ - 2022 దరఖాస్తుకు ఈ రోజే ఆఖరు తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్ అనంతరం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జేఎన్టీయూ (హైదరాబాద్) నిర్వహిస్తుంది.
తెలంగాణ ఎంసెట్‌కు ఇప్పటి వరకు సుమారుగా రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 17, 2022 వరకు అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అగ్రికల్చర్, మెడికల్ పరీక్షను జూలై 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ (Engineering) పరీక్షను జూలై 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు.
ఇంటర్ (Inter) విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఇంటర్ ఎగ్జామ్స్, ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ ఎంసెట్ 2022లో ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలు అని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇంటర్ వెయిటేజీకి సైతం ఎంసెట్ ర్యాంకులలో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ సారి ఎంసెట్ ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలని విద్యాశాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కరోనా కారణంగా సరిగా చదవని విద్యార్థులకు ఊరట కలుగనుంది.
ఇప్పటి వరకు ఎంసెట్ ర్యాంకు కేటాయించాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్లో 45 శాతం, ఇతర కేటగిరీల వారికి 40 శాతం మార్కులు తప్పనిసరి ఉండాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు మినిమం మార్కులతో ఇంటర్ పాస్ అయితే చాలు అని గుడ్ న్యూస్ చెప్పారు. మరోవైపు ఎంసెట్ ర్యాంకులలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.