TS EAMCET 2021: తెలంగాణలో ఎల్లుండే ఎంసెట్ ఎగ్జామ్.. విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలివే..

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ ను ఎల్లుండి నుంచి నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే విద్యార్థులు ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.

 • Share this:
  కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ ను తిరిగి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ పరీక్షను ఎల్లుండి(4వ తేదీ) నుంచి నిర్వహించనున్నారు. 4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంకా అగ్రికల్చర్, మెడిసిన్ ప్రవేశ పరీక్షలను 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇందు కోసం తెలంగాణ వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో చదివే ఏపీ విద్యార్థుల కోసం ఆ రాష్ట్రంలో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌలభ్యం కోసం మూడు భాషల్లో అంటే తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రశ్నపత్రాలను సిద్ధం చేశారు.
  TMREIS Recruitment 2021: తెలంగాణ మైనార్టీ కాలేజీల్లో 840 జూనియర్ లెక్చరర్ పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే
  CBSE 10th Result 2021: ఈ రోజే సీబీఎస్ఈ టెన్త్ ఫలితాలు?.. బోర్డు కీలక ప్రకటన.. వివరాలివే

  విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ కు అనుగుణంగా ప్రశ్నపత్రాలను అందించనున్నారు. విద్యార్థుల కసం పరీక్ష కేంద్రాల రూట్ మ్యాప్ ను హాల్ టికెట్ పై ముద్రించారు. వాస్తవానికి ఎంసెట్ హాల్ టికెట్ డౌన్ లోడ్ గడువు జులై 31తో ముగియనుండగా.. అధికారులు ఈ రోజు అంటే జూన్ 2 వరకు పొడిగించారు.

  ఈ డిక్లరేషన్ ఇస్తేనే ఎగ్జామ్..
  కరోనా నేపథ్యంలో ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహణకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. హాల్ టికెట్ వెనకవైపున విద్యార్థులు పాటించాల్సిన కరోనా మార్గదర్శకాలను ముద్రించారు. తమకు జ్వరం, జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా డిక్లరేషన్ ఇచ్చిన వారినే పరీక్షకు అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు తప్పనిసరిగా మాస్కును ధరించి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

  వారికి మరో ఛాన్స్..
  కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో సమర్పించని అభ్యర్థుల కోసం మరో అవకాశాన్ని కల్పించారు అధికారులు. పరీక్షా కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను సమర్పించే అవకాశాన్ని కల్పించారు.
  Published by:Nikhil Kumar S
  First published: