Telangana DOST 2020: ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్... డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్

Telangana DOST 2020 | తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్‌మెంట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: August 21, 2020, 10:44 AM IST
Telangana DOST 2020: ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్... డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
Telangana DOST 2020: ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్... డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్-TSCHE డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ-DOST నోటిఫికేషన్ విడుదల చేసింది. దోస్త్ ప్లాట్‌ఫామ్‌లో డిగ్రీ కోర్సులకు ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీకామ్ వొకేషనల్, బీకామ్ హానర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఎం, బీసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్థులు దోస్త్ ప్లాట్‌ఫామ్ అయిన https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 105 దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్లు, మీసేవ సెంటర్‌లో కూడా రిజిస్టర్ చేయొచ్చు. T App Folio Mobile App లో కూడా విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవచ్చు. డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతుల్ని ఎప్పట్నుంచి నిర్వహిస్తామన్న విషయం వెల్లడించలేదు.

ECIL Jobs: బీటెక్ పాసైనవారికి 350 ఉద్యోగాలు... ఈసీఐఎల్-హైదరాబాద్ జాబ్ నోటిఫికేషన్

IBPS PO: డిగ్రీ పాసైనవారికి 1167 బ్యాంకు ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Telangana DOST 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


దోస్త్ 2020 నోటిఫికేషన్- 2020 ఆగస్ట్ 20
దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 7ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్- 2020 ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు
ఫేజ్ 1 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్- సెప్టెంబర్ 3, 4
ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్- 2020 సెప్టెంబర్ 16
ఫేజ్ 1 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్- 2020 సెప్టెంబర్ 17 నుంచి 22
ఫేజ్ 2 రిజిస్ట్రేషన్- 2020 సెప్టెంబర్ 17 నుంచి 23
ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్- 2020 సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు
ఫేజ్ 2 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్- సెప్టెంబర్ 21
ఫేజ్ 2 సీట్ అలాట్‌మెంట్- 2020 సెప్టెంబర్ 28
ఫేజ్ 2 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్- 2020 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకు
ఫేజ్ 3 రిజిస్ట్రేషన్- 2020 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు
ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్- 2020 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు
ఫేజ్ 3 స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్- సెప్టెంబర్ 30
ఫేజ్ 3 సీట్ అలాట్‌మెంట్- 2020 అక్టోబర్ 8
ఫేజ్ 3 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్- 2020 అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 10 వరకు
ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లో సీట్లు అలాట్ అయిన విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేయాల్సిన తేదీ- 2020 అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 12 వరకు

National Recruitment Agency: నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీతో నిరుద్యోగులకు లాభమిదే

Jobs: భారతీయ పశుపాలన్ నిగమ్‌లో 3348 జాబ్స్... పోస్టులు ఇవే

Telangana DOST 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు విధానం- దోస్త్ వెబ్‌సైట్ https://dost.cgg.gov.in/, దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్, మీసేవ సెంటర్‌, T App Folio Mobile App
రిజిస్ట్రేషన్ ఫీజు- రూ.200
డిగ్రీ కోర్సులు- బీఏ, బీకామ్, బీఎస్సీ, బీకామ్ వొకేషనల్, బీకామ్ హానర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఎం, బీసీఏ
యూనివర్సిటీలు- ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు యూనివర్సిటీలు.
Published by: Santhosh Kumar S
First published: August 21, 2020, 10:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading